ఏం మొహం పెట్టుకుని కర్నూలు వచ్చావు బాబూ?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్‌

రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు హంగామా

కర్నూలుకు ఏం చేయని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు

రాష్ట్రం ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది చంద్రబాబే కదా?

కర్నూలు: కర్నూలుకు న్యాయ రాజధాని వద్దని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని కర్నూలు వచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడు చేసింది చంద్రబాబు కదా అని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే దిక్కుమాలిన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అడ్డుతగుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పుట్టి..ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కర్నూలులో హాఫీజ్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు.

ఇవాళ చంద్రబాబు కర్నూలు వచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కర్నూలుకు వచ్చి మాట్లాడిన భాషను చూసి జిల్లా ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారు. మా ప్రాంతానికి వచ్చి బాదుడే బాదుడు అంటున్నాడు. ఎవరికి బాదుడేబాదుడు. ప్రజలు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడిని బాదాడు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చొబెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇలా అన్ని రేట్లు పెంచిన ఘనుడు చంద్రబాబు. ఇవాళ ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కర్నూలు జిల్లాకు ఒక చరిత్ర ఉంది. దాదాపు 85 సంవత్సరాల క్రితం శ్రీబాగ్‌ ఒప్పందం జరిగింది. దాని గురించి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. అవమానం జరిగింది. ఆ రోజు పెద్ద మనుషులు శ్రీభాగ్‌ ఒప్పందం రాసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత మొట్ట మొదట కర్నూలుకు రాజధాని రావాలి. హైకోర్టు, రాజధాని, రియల్‌ ఎస్టేట్‌ దందా అన్ని కూడా అమరావతిలోనే పెట్టుకున్నాడు. చంద్రబాబుకు నిజంగా సిగ్గు ఉంటే కర్నూలుకు ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు. కర్నూలుకు న్యాయ రాజధాని వద్దు అంటున్నాడు. మా పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మా రైతులకు నీళ్లు వద్దా?. మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా?. మాకు భారీ ప్రాజెక్టులు వద్దా? మాకు హైకోర్టు వద్దా?. 29 గ్రామాల మేలు కోసం అక్కడి రైతులతో డ్రామా చేయిస్తూ కథ, స్క్రీన్‌ప్లే నడిపిస్తున్నారు. ఇవాళ మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి ఓట్లు కావాలని మాట్లాడుతున్నారు. వైయస్‌ జగన్‌ శ్రీభాగ్‌  ఒప్పందానికి కట్టుబడి ఉండి కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తుంటే అడ్డుకుంటున్నది చంద్రబాబు, పవన్‌ మాత్రమే. ఈ గడ్డపై పుట్టిన చంద్రబాబు ఎన్నో పదవులు పొందారు. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని  అడ్డుకుంటున్నారు. చరిత్రలో రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబే. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా ఉంటారా? మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మంచి మనసుతో మూడు రాజధానులు చేస్తున్న వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారు. కొత్త రాష్ట్రం డిమాండు రాకుండా అన్నింటికి వికేంద్రీకరణ ద్వారా పరిష్కారం చూపుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులు మీ రాజకీయ భవిష్యత్‌ ఏంటి?. మా గడ్డపై చంద్రబాబు తిరగాలంటే, ఓట్లు, సీట్లు కావాలంటే మూడు రాజధానులకు, న్యాయ రాజధానికి మద్దతు ఇవ్వాలని హాఫీజ్‌ ఖాన్‌ డిమాండు చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? వైయస్‌ జగన్‌ ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు తన కుమారుడికి దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చారని ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ గుర్తు చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top