చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి

ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌
 

విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదన్నారు. అందుకే ఇవాళ చంద్రబాబుపై ప్రజాగ్రహం పెల్లుబికిందన్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి కాబట్టే చంద్రబాబును విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ప్రజలు అడ్డుకున్నారన్నారు. అరగంట పాటు ఎయిర్‌ పోర్టులోనే ఉంటే అంతా క్లియర్‌ చేస్తామని పోలీసులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదని తప్పుపట్టారు.

Back to Top