ఏబీవీ= ఇజ్రాయల్ పెగాసస్ సాఫ్ట్ వేర్

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

 టీడీపీ-ఏబీవీపై 5 కోట్ల ఆంధ్రులు డిఫరమేషన్ వేస్తారు

 పోలీసు అధికారిగా ఏబీవీ అన్ ఫిట్.. హోం గార్డుగా కూడా పనికిరాడు

అమ‌రావ‌తి: ఏబీ వెంకటేశ్వర రావు ఐపీఎస్ కాద‌ని,  ఏబీవీ అంటే...  ఇజ్రాయల్ పెగాసస్  సాఫ్ట్ వేర్ అన్నట్టు ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ అభివ‌ర్ణించారు . ఆయన ఐపీఎస్ కి కాదు,  కనీసం హోమ్ గార్డ్ గా కూడా పని చేయడానికి అర్హుడు కాదన్నారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద అమ‌ర్‌నాథ్ మాట్లాడారు.

పెగాసస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఆరోపించారు.  శాసనసభలో ఈ అంశం పై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేది, ఎందుకు పారిపోయారు..?

  పెగాసస్ స్పై వేర్ ను వాళ్ళే కొనుగోలు చేస్తారు.... మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు,  టీడీపీ వాళ్లే ఒకరికి ఒకరు వత్తాసు పలుకుతుంటారు.  లోకేష్ సవాళ్ళు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి. 

ఏబీ వెంకటేశ్వర రావు మా మీద డిఫమేషన్ వేస్తాం అంటున్నారు.  మీ మీద 5 కోట్ల రాష్ట్ర ప్రజలు డిఫరమేషన్ వేస్తారు. సీఎంవో ఉద్యోగి శ్రీహరి తన జీవితంతో ఆడుకున్నాడు అని ఏబీవీ అంటున్నాడు. ఐపీఎస్ గా 30 ఏళ్ళు సర్వీసులో ఉండి, నిన్ను నీవే కాపాడుకోకపోతే.. పోలీసు అధికారిగానే ఏబీవీ అన్ ఫిట్ అని అమ‌ర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

 
 చంద్రబాబు ఒక పొలిటికల్ పర్వర్టెడ్. ఆయనకు విలువలు లేవు, విశ్వసనీయత లేదు. అనైతిక, అరాచక, దుర్మార్గపు రాజకీయాలను చేసిన వ్యక్తి.  ఇటువంటి చంద్రబాబు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top