రాజకీయాల్లో రాబందులా చంద్రబాబు  

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి  గుడివాడ అమర్నాథ్  

  శవ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్ లను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

  ప్రాణం విలువ తెలిసిన నాయకుడు సీఎం వైయ‌స్ జగన్.. ప్రాణాలంటే లెక్కలేకుండా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు

  దళితుల్లో ఎవరు పుట్టాలని మాట్లాడిన చంద్రబాబుకు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఎవరు నమ్ముతారు..? 

వైయ‌స్‌ జగన్ దేవుడు లాంటి వ్యక్తి అని డాక్టర్ సుధాకర్ మాట్లాడిన మాటలు గుర్తులేవా...?

 ఆంధ్రప్రదేశ్ కు టూరిస్టుల్లా వచ్చిపోయే చంద్రబాబు, లోకేష్ లు ప్రజల్ని ఉద్దరిస్తారా..? 

విశాఖ‌: రాజకీయాల్లో చంద్రబాబు ఒక రాబందులా తయారయ్యాడ‌ని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందా.. దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలన్న తాపత్రయమే వారి చర్యల్లో అడుగడుగునా కనిపిస్తుంది. మరణించిన వ్యక్తులకు పిండం పెట్టినప్పుడు కాకులు వాలినట్టు... ఈరోజు లోకేష్ కాకిలా తయారయ్యార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో గుడివాడ అమ‌ర్‌నాథ్ మాట్లాడారు. 

ప్రపంచ మానవాళిని కుదిపేస్తోన్న కోవిడ్ పై అంతా పోరాటం చేస్తున్న సమయంలో.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఎక్కడ సందు దొరికితే అక్కడ రాజకీయం చేయాలని, ఎక్కడైనా ఎవరిదైనా ప్రాణం పోతే దాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేయాలని పడుతున్న తపన, తాపత్రయం చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలు వారిని పూర్తిగా అసహ్యించుకుంటున్నారు.

 డాక్టర్ సుధాకర్  అనారోగ్యానికి గురై, గుండెపోటుతో మరణించడం, అంతకు ముందు ఏడాది క్రితం జరిగిన పరిణామాలు అన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా జరుగుతుంది. డాక్టర్ సుధాకర్ చనిపోవడం దుదృష్టకరం. అయితే ఆయన మరణాన్ని టీడీపీ రాజకీయం కోసం వాడుకుంటున్న తీరు చూస్తుంటే బాధేస్తుంది. ఉన్నపళంగా చంద్రబాబుకు, లోకేష్ కు దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దళితులకు వారేదో మంచి చేసినట్టు, మేమేదో దాడులు చేసినట్టు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 
 
 దళితుల పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంక్షేమ పథకాన్ని దళితులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించి వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేయడంతోపాటు, కేబినెట్ లో కీలకమైన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రితో సహా మొత్తం ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు. 

 డాక్టర్ సుధాకరే గతంలో చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పాడు. "నేను కుట్రలో ఇరుక్కుపోయాను. కొందరి కుట్రలో భాగస్వామిని అయిపోయాను. జగన్ మోహన్ రెడ్డిగారు దేవుడు లాంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డిగారు అంటే నాకు ఎంతో ఇష్టం.." అని చెప్పిన విషయాలను లోకేష్ మరిచిపోయి, ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి దళితులపై లేని ప్రేమను ఒలకబోసే ప్రయత్నం చేశాడు. 

దళితులంటే ఎవరికి చిన్నచూపో, దళితుల గురించి ఎవరు ఏం మాట్లాడారో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు, లోకేష్ లకు దళితుల మీద ప్రేమ ఇప్పుడే పుట్టుకొచ్చిందా..? ముఖ్యమంత్రిగా చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన మాటలను లోకేష్ మరిచిపోయాడా..?  అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న లోకేష్.. ఆయన జయంతి, వర్థంతికి తేడా తెలియకుండా మాట్లాడింది మరిచిపోయారా..? రాజకీయాలంటే మాకు.. మీకు కాదు పిచ్చి ముండా కొడుకుల్లారా.. అని టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన మాటలు మరిచిపోయారా..?

శుద్ధి, శుభ్రం ఉండదు.. అని దళితులను ఉద్దేశించి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడిన మాటలు మరిచిపోయారా..?
పెందుర్తిలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన విషయాలను మరిచిపోతే ఎలా..?  నోరు ఉంది కదా అని ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలే తిరగబడతారు.  లోకేష్ శరీరాన్ని ఎటూ అదుపులో పెట్టుకోలేడు.. కనీసం నోటిని అయినా అదుపులో పెట్టుకుంటే మంచిది. 

 డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాత్ర ఎంత ఉందో, అప్పట్లో బయటకు వచ్చిన సీసీ ఫుటేజీలో చూశాం. ఆయన ఏం మాట్లాడాడు, డాక్టర్ ని ఎవరు బెదిరించారు.. ఏం మాట్లాడించారు.. ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియనివి కావు.  సీబీఐ నివేదికలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇందులో మా పార్టీకిగానీ, మా పార్టీ ఎమ్మెల్యేలకు గానీ ఎటువంటి పాత్రగానీ, సంబంధంగానీ లేదు. 
 ముఖ్యమంత్రి శ్రీ‌వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు శత్రువుకు కూడా మేలు చేసే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. శత్రువులతో కూడా పొగిడించుకునే స్థాయిలో ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారు ఉన్నారు.  శ్రీ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి మానవత్వం, వ్యక్తిత్వం గురించి శాసన మండలి ఛైర్మెన్ గా ఉన్న షరీఫ్ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి అని లోకేష్ కు, టీడీపీ నాయకులకు చెబుతున్నాం. 

 మనుషులన్నా, ప్రాణాలన్నా విలువ లేకుండా మాట్లాడే వ్యక్తిత్వం చంద్రబాబుదే. రాజమండ్రి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోతే.. యేటా కుంభమేళాల్లో చనిపోవడంలేదా.. బస్సు యాక్సిడెంట్లలో చనిపోవడంలేదా.. అని కనీసం మానవత్వం లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అటువంటి మనస్తత్వం ఉన్న చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఈరోజు ఎక్కడ శవం దొరుకుతుందా.. రాజకీయం చేద్దాం అని తిరుగుతున్నారు. 

 కృష్ణపట్నం ఆనందయ్య మందు అందరికీ పంచవచ్చు కదా.. అని చంద్రబాబు, లోకేష్ లు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలేవో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన రామోజీ రావు బంధువు, భారత్ బయోటెక్ వారికి ఆ సలహా ఇచ్చి ఉంటే కనీసం వ్యాక్సిన్లు అయినా రాష్ట్రానికి వచ్చి ఉండేవి. చేయాల్సిన పని చేయకుండా.. రోజూ  జూమ్ మీటింగ్ లు పెట్టి, ఉచిత సలహాలు ఇస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఎంతసేపటికీ ప్రభుత్వాన్ని ఏ రకంగా నిందించాలి, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారిపై ఏవిధంగా బురదజల్లాలనే ప్రయత్నం తప్పితే వీళ్ళకు మరో అజెండా లేదు. 

 అధికారం ఉంటే కరకట్ట మీద అక్రమ కట్టడంలో తండ్రీకొడుకులు ఉంటారు.. అధికారం పోతే హైదరాబాద్ లోని రాజ భవవంలో ఉంటారు. చంద్రబాబు, ఆయన కొడుకు విహార యాత్రకు టూరిస్టులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిపోతుంటారు. ఇటువంటి వ్యక్తులు ప్రజలను ఉద్దరిస్తామని చెప్పడం, ప్రజలకు ఏదో చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారు.  హైదరాబాద్ లో నివాసం ఉంటూ.. ఈ రాష్ట్రంలో పార్టీని నడపడం, నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ వస్తున్న వీరిని ఏమనాలి..?

 బిల్ గేట్స్ కు, బిల్ క్లింటన్ ను నేనే సలహాలు ఇచ్చాను, అబ్దుల్ కలాం ను నేనే రాష్ట్రపతిని చేశాను అని చెప్పుకునే మీ తండ్రి చంద్రబాబు నాయుడు, నిన్ను మంగళగిరిలో ఎందుకు గెలిపించలేకపోయాడు, అంటే మీ చేతగాని నాయకత్వం బయటపడటం లేదా..? ప్రజల్లో గెలవలేక, అన్ని ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలై, ప్రజలకు ముఖం చూపించలేక శవ రాజకీయాలు, నీచ రాజకీయాలే పనిగా పెట్టుకున్న తండ్రీకొడుకులకు మళ్ళీ మళ్ళీ ప్రజలు బుద్ధి చెబుతారు. 

 విశాఖపట్నంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు నెల రోజుల్లో పదుల సంఖ్యలో చనిపోతే.. కనీసం వారి కుటుంబాలను పరామర్శించటానికి మనసు రాని లోకేష్.. దళితుల పేరుతో శవ రాజకీయాలు చేయడం చూస్తుంటే.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారు. మీ అసమర్థ నాయకత్వం కింద పనిచేయడానికి మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిగ్గుపడుతున్నారు. 
 రాజకీయాలు చేయడానికి డాక్టర్ సుధాకర్ మరణం మీకు అవసరం వచ్చిందా..?  గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 14 మంది చనిపోతే కనీసం తండ్రీకొడుకులు రాలేదు.   అచ్చెన్నాయుడును రూ. 150 కోట్ల స్కాంలో అరెస్టు చేస్తే మాత్రం.. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం దొరుకుతుందా..? అలానే హత్య కేసులో ఉన్న కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం దొరుకుతుందా..?

ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నాం.   ఎన్టీఆర్ చావుకు కారకుడైన వ్యక్తి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలకు దండలు వేసి, దీపాలు వెలిగించిన వ్యక్తి కూడా చంద్రబాబే. 

 పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే హక్కును కోల్పోవడానికి కారకుడు చంద్రబాబే. ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో చంద్రబాబు రాత్రికి రాత్రి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. అందుకే ఇప్పుడు సరిహద్దుల్లో మన వాహనాలను నిలిపివేసే పరిస్థితి వచ్చింది. అంబులెన్స్ లను, అనుమతి ఉన్న వాహనాలను ఆపవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉంద‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top