ఆప‌ద్భాంధవుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే  గుడివాడ అమ‌ర్నాథ్ 

విప‌త్తులు ఎప్పుడు వ‌స్తాయా అనే వికృత ఆనందం పొందే నాయ‌కుడు చంద్ర‌బాబు..

విజ‌య‌సాయిరెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ ద్వారా ప్రాణాలు కాపాడే ప్ర‌య‌త్నం చేస్తుంటే ఓర్వ‌లేక‌ విమర్శలు  

టీడీపీ నేత‌లు ఎవ‌రైనా ఒక్క ప్రాణాన్ని కాపాడ‌డానికి ఆలోచ‌న చేశారా?

తెలంగాణ ప్ర‌భుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌డానికి బాబుకు ధైర్యం లేదు

రాజ‌ద్రోహం చేసిన వారిని  క‌రోనా ప‌రిస్థితుల్లో వ‌దిలేయ‌మంటే ఎలా..?

విశాఖ‌:  క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తూనే.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి పేద‌వాడికి కూడా ఏ ఒక్క సంక్షేమం ప‌థ‌కం ఆప‌కుండా ఆప‌ద్భాంధవుడిలా ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్  ఆదుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. దేశ‌మంతా క‌రోనాతో పోరాడుతుంటే..రాష్ట్రంలో మాత్రం ప్ర‌తిప‌క్ష నేత రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతున్నార‌ని మండిప‌డ్డారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపి, ప్ర‌భుత్వానికి స‌లహాలు ఇవ్వ‌డం మానేసి..ప‌క్క రాష్ట్రంలో కూర్చొని వికృతి చేష్టాలకు పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ఫూర్తితో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, మ‌రికొంద‌రు పార్టీ నేత‌లు క‌రోనా రోగుల‌కు వైద్య‌సేవ‌లు అంద‌స్తుంటే ప్ర‌తిప‌క్ష‌నేత ఓర్వ‌లేక విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గుచేటు అన్నారు. శ‌నివారం విశాఖ‌లోని వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో గుడివాడ అమ‌ర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

 ఎద్దు పుండు బాధ‌ కాకికి ఏం తెలుసు, పొడ‌వ‌డం త‌ప్ప అన్న చందంగా.. క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని ప‌ట్టిపీడిస్తున్న త‌రుణంలో రాబందుల్లా ప్ర‌జ‌ల ప్రాణాలు పోతే బాగుంటుంది, వైద్య సేవ‌లు అంద‌క‌పోతే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ప్ర‌త‌ప‌క్ష నేత చంద్ర‌బాబు ఉన్నారు. విప‌త్తులు ఎప్పుడు వ‌స్తాయా అనే వికృత ఆనందం పొందే నాయ‌కుడు చంద్ర‌బాబు..

 కోవిడ్ వ‌ల్ల చ‌నిపోయిన కుటుంబాల‌కు కొవ్వుత్తులు వెలిగించి సంతాపం తెలియ‌జేసే కార్య‌క్ర‌మం చంద్ర‌బాబు చేశారు. చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు గోదావ‌రి పుష్క‌రాల‌లో భాగంగా, రాజ‌మండ్రిలో సినిమా షూటింగ్ ల కోసం 29 మంది ప్రాణాలు బ‌లిగొన్న త‌రుణంలో ఒక్క కొవ్వొత్తి అయినా వెలిగించావా?  అధికారం కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయ‌న చావుకు కార‌ణ‌మైన చంద్రబాబు, ఆయ‌న ఫోటో ముందు ఏనాడైనా ఒక దీపం వెలిగించాడా? 

 క‌రోనా వ‌ల్ల దేశంలో, రాష్ట్రంలో ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్న తరుణంలో చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తూ.. మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు.  ప్ర‌జ‌ల ప్రాణాలు పోవాల‌నే కోరుకునే నాయ‌కుడు చంద్ర‌బాబు. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఇటువంటి విప‌త్తులు ఎప్పుడు వ‌స్తాయా అని ఎదురుచూసే మనిషి చంద్ర‌బాబు.

 100సంవ‌త్స‌రాల్లో ఇటువంటి మ‌హ‌మ్మారిని మ‌నం చూసి ఉండము.. అలాగే గ‌త ప‌దివేల సంవ‌త్స‌రాల్లో చంద్ర‌బాబులాంటి జ‌న్మఎత్తిన వ్య‌క్తి ఎవ‌రూ ఉండ‌రు.. చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల క‌ష్టాలు, బాధ‌లు తెలియ‌వు. ఆప‌ద‌లో ఉన్న ప్రజలను ఎలా ఆదుకోవాలో తెలియ‌దు.. కేవ‌లం విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రాజ‌కీయం చేయాల‌నే త‌ప‌న మాత్ర‌మే చంద్ర‌బాబుది..

 రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఆస్ప‌త్రుల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తూనే.. ఇంకా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవలు అందించాల‌నే త‌ప‌న‌తో విశాఖ ప్రాంత్రంలోని ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందిచాల‌ని ప్ర‌గ‌తి భార‌త్ ట్రస్ట్ ద్వారా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ‌య‌సాయిరెడ్డిగారు ఆక్సిజ‌న్ బెడ్ల కొర‌త తీర్చాల‌ని రూ.6 కోట్ల‌తో  300 బెడ్స్ అందుబాటులోకి తీసుకువస్తే, టీడీపీ నాయ‌కులు స‌హించ‌లేక‌పోతున్నారు.  ప్ర‌గ‌తి భార‌త్ ట్ర‌స్ట్ పెద్ద‌లు విజ‌య‌సాయిరెడ్డి గారు మ‌ల్టీ లెవ‌ల్ ఆక్సిజ‌న్ సిస్ట‌మ్ ను ఏర్పాటు చేసే, ఏకకాలంలో 300 మందికి ఉప‌యోగ‌ప‌డే కోవిడ్ కేర్ సెంట‌ర్ ద్వారా ప్రాణాలు కాపాడే ప్ర‌య‌త్నం చేస్తుంటే ఓర్వ‌లేని త‌నంతో టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు..  

  టీడీపీ జాతీయ‌ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నుంచి ఆ పార్టీ మాజీ మంత్రులు, శాస‌న‌స‌భ్యులు వ‌ర‌కు ఎవ‌రైనా ఒక్క ప్రాణాన్ని కాపాడ‌డానికి ఆలోచ‌న చేశారా?.  తెలంగాణ బోర్డ‌ర్ లో అంబులెన్స్ లు వెళ్ల‌కుండా అడ్డుకుంటే హైద‌రాబాద్ లో ఇంద్ర‌భ‌వ‌నంలో కుర్చొన్న‌ చంద్ర‌బాబు క‌నీసం ఒక్క మాట కూడా మాట్లాడ‌డానికి ధైర్యం చేయ‌లేని పిరికిపంద.

 గ‌తంలో మీ నాయ‌క‌త్వంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఒక్క మాట‌ కూడా మాట్లాడ‌లేదు. కేసిఆర్ అంటే చంద్రబాబుకు భయం.  మాట్లాడితే ఎక్క‌డ తన సంగ‌తి తేలుస్తాడ‌నే భ‌యంతో మాట్లాడ‌లేని ఒక చేత‌గాని నాయ‌కుడు చంద్రబాబు, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌డం దుర‌దృష్ట‌క‌రం.

 చంద్ర‌బాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న‌ప్పుడు కానీ, దాదాపు 21 సంవ‌త్స‌రాలు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కానీ వైద్యం కోసం ఒక్క పెద్ద సంస్థ‌నైనా తీసుకోవ‌చ్చారా?  వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయాల‌ని, మెడిక‌ల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకురావాల‌ని ఏనాడైనా ఆలోచ‌న చేశారా?

ఈ రెండు సంవ‌త్స‌రాల్లో 14 వైరాల‌జీ ల్యాబ్ లు ఏర్పాటు చేసిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారిది. ఈ రాష్ట్రంలో 11 మెడిక‌ల్ కాలేజీ లు ఒక్కొక్క కాలేజీకీ రూ.500 కోట్లుతో  సూప‌ర్ స్పెషాలిటీ హాస్ప‌ట‌ల్ తో పాటు ఏర్పాటు చేస్తోన్న ఘ‌నత  శ్రీ జ‌గ‌న్ గారిది.

రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాడికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలు పోస్తున్న ప్రభుత్వం ఇది.  గ‌తంలో 108 అంబులెన్స్ లు డీజిల్ లేక, మరమ్మత్తులకు నోచుకోక మూల‌న‌ప‌డితే క‌నీసం బాగుచేయించడానికి మ‌నసురాని నాయ‌కుడు చంద్ర‌బాబు. 

ఒకేసారి 1088.. 108, 104 అంబులెన్స్ లను ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా ఇస్తున్నారు.  నాడు-నేడు కింద దాదాపు రూ.5వేల కోట్లు వైద్యానికి ఖ‌ర్చుపెడుతున్న గొప్ప‌ మ‌నసు ఉన్న సీఎం శ్రీ జ‌గ‌న్. అధికారంలోకి వచ్చిన ఈ 24 నెల‌ల్లో దాదాపు 15 నెల‌లుగా కోవిడ్ తో పోరాటం చేస్తున్నాం.. అయినా ఏనాడు పేద‌వారికి అందించే సంక్షేమ ప‌థ‌కాలు ఆగ‌లేదు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చే సంక్షేమ, అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఆగ‌లేదు. విద్య, వైద్య రంగంలో ఏనాడు వెనుక‌డుగు వేయ‌లేదు.

 గ‌తంలో 27వేల ఆక్సిజ‌న్ బెడ్స్ ఉంటే దానిని కేవ‌లం 15 రోజుల్లో 45వేల ఆక్సిజ‌న్ బెడ్స్ కు పెంచాము. రాష్ట్ర ప్ర‌జ‌లు, పేద‌వారి ఆరోగ్యాన్ని మొద‌టి ప్రయారిటీగా తీసుకున్న సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్.   వ్యాక్సిన్ విష‌యంలో చంద్ర‌బాబు ఏ విధంగా రాజ‌కీయం చేశారో అంద‌రం చూశాం.  వ్యాక్సిన్ ఫార్ములాను మిగతా కంపెనీలకు బదిలీ చేస్తే దేశంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ తొంద‌ర‌గా అందుతుంద‌నే శ్రీ  జ‌గ‌న్ గారి ఆలోచ‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆచ‌రించే ప‌రిస్థితులు ఉన్నాయి. జాతీయ మీడియా కూడా సీఎం శ్రీ‌ జ‌గ‌న్ గారి సూచనను అభినందిస్తున్నారు.  సీఎం శ్రీ జ‌గ‌న్ గారికి స‌ల‌హాలు ఇచ్చే ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు లేరు.. ఆయ‌న‌కు అటువంటి ఆలోచ‌న‌లు, గుణం లేదు. ప్ర‌జ‌ల్ని, పేద‌వారిని కాపాడాల‌నే త‌ప‌న చంద్ర‌బాబుకు లేదు.

 ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అరెస్టు చేస్తే ఎలా కాపాడాలి, ఎలా ఈ ప్ర‌భుత్వం మీద దుమ్మెత్తిపోయాలి ఆయ‌న్ను ఎలా కాపాడుకోవాల‌నే తాప‌త్ర‌యం త‌ప్ప.. ప్ర‌జ‌ల ప్రాణాల గురించి, పేద‌వారి గురించి చంద్ర‌బాబు ఆలోచించ‌ట్లేదు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఎలా కాపాడాలి, ఏబీఎన్ రాధాకృష్ణ‌ను ఎలా కాపాడాలి, భార‌త్ బ‌యోటెక్ కు బంధువైన ఈనాడు రామెజీరావును ఎలా కాపాడాలి అన్నవే చంద్ర‌బాబు ముందున్న లక్ష్యాలు. 

 ర‌ఘురామ‌కృష్ణ మీద రాజ‌ద్రోహం కేసు పెడితే ఆయ‌న‌కు అనుకూలంగా చంద్ర‌బాబు, ఆ పార్టీ నాయ‌కులు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీ వారు మాట్లాడారు.  రాజ‌ద్రోహం కేసు మోపిన వ్య‌క్తికి ప్రొటెక్ష‌న్ గా చంద్ర‌బాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, టీవీ5 నాయుడులు వ్యవహరిస్తున్నారు.  రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఈ ప్ర‌భుత్వాన్ని ఏ ర‌కంగా కూల్చివేయాలి,  ఈ ప్ర‌భుత్వం మీద ఏ ర‌కంగా విమ‌ర్శలు చేయాల‌ని తప‌నప‌డుతున్న వ్య‌క్తిని కాపాడ‌డానికి ముందుకు వ‌చ్చిన చంద్రబాబు అండ్ కో తాపత్రయం చూస్తుంటే.. ఈ రాష్ట్రంలోని ప్ర‌జ‌లు, పేద‌లు ఏమైపోయినా ప‌ర్లేదు అన్నది ఈ సంఘ‌ట‌న‌తో తేలిపోయింది.

ఆఖ‌రి గ‌డియాల్లో ఉన్న మీకు ఇప్ప‌టిక‌న్నా బుద్ది మారాలి.. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం అవ‌స‌ర‌మైతే స‌ల‌హాలు ఇవ్వండి. లేక‌పోతే  ఇంద్ర‌భ‌వ‌నంలో తండ్రికొడుకులు కుర్చోండి.  రాజ‌ద్రోహం చేసిన వారిని, మ‌ర్డ‌ర్ చేసిన వారిని క‌రోనా ప‌రిస్థితుల్లో వ‌దిలేయ‌మంటే ఎలా.. సీఐడీ వారి బాధ్య‌త‌ను వారు నిర్వ‌ర్తించారు.. వారి ప‌ని వారు చేసుకుంటున్నారు. దానికీ, మా ప్ర‌భుత్వానికి సంబంధం లేదు.  సీఐడీ చ‌ర్య‌లు తీసుకుంది. కోర్టు కూడా ఏం చెప్పిందో చూశామ‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top