ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లు సువర్ణాధ్యాయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు
 

 

అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. బడుగుల బాగుకోసం పరితపిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎస్సీల్లో కూడా బాగా వెనకబడిన ఉప కులాల కోసం మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. గత ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఎస్సీ, ఎస్టీలు అనేక అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లుపై ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఏమన్నారంటే..

‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలు ఎంత ఘోరమైన అవమానానికి గురయ్యారు. రాజ్యాంగంలో 238 ఆర్టికల్‌ ప్రకారం డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో మహానాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తే.. నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకువేస్తానని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌ అణగారిన వర్షాల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  జననేత వైయస్‌ జగన్‌ పేదల కోసమే జీవిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు.  2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అరెస్టు చేయక్కర్లేదు అని సుప్రీం కోర్టు ఆర్డర్‌ ఇస్తే.. అది చాలా అన్యాయం.. ఆ రకంగా జరిగితే పేదలకు న్యాయం జరగదని సీఎం వైయస్‌ జగన్‌ గతంలో ఒక లేఖ ప్రధానమంత్రికి లేఖ రాశారు.

గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలు అనేక అవమానాలకు గురయ్యారు. పశ్చిమగోదావరిలో గరగపర్రు సన్నివేశం, విశాఖలో జెర్రిపోతులపాలెం, చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను పురుగులుగా చూశారు. ఈ రోజున చంద్రబాబు చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం, విభజన వల్ల ఎస్సీ, ఎస్టీలకు లాభం చేకూరుతుంది. ఎస్సీల్లో కూడా బాగా వెనకబడిన కుటుంబాలు, ఉప కులాల కోసం మాల, మాదిగ, రెల్లీ కార్పొరేషన్‌ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.

అంబేడ్కర్‌ ఏ ఉద్దేశంతో రాజ్యాంగంలో హక్కులు కల్పించారో.. అంతకంటే ఎక్కువగా అణగారిన వర్షాల కోసం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న పథకాలు ప్రతీ ఒక్కరూ చూస్తున్నారు. ఏసీబీ కోర్టు స్టేట్‌ సబ్జెక్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెంట్రల్‌ సబ్జెక్టు, సెంట్రల్‌ సబ్జెక్టుగా ఉన్న దాన్ని పోలీసు వర్గాలు ఈ రోజుకు కూడా అరెస్టులు చేయడం లేదు. ఈ సభ సాక్షిగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. విభజన బిల్లు తీసుకువచ్చిన సీఎం వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని భావిస్తున్నాను. ఈ బిల్లును మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నా’ అని ఎమ్మెల్యే బాబురావు చెప్పారు.

Back to Top