జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ దుష్ప్రచారం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అమరావతి: జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఉదయం సభను టీడీపీ నేతలు అడ్డుపడటాన్ని శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సారా గురించి టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మద్యనిషేధాన్ని ఎత్తివేసి, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పాలించింది టీడీపీ కాదా అన్నారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు నడిపిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. జంగారెడ్డిగూడెనికి సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు. ఈ రోజు చంద్రబాబు జంగారెడ్డిగూడెం వెళ్తున్నారని, సభలో టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 
 

Back to Top