సభలో గందరగోళం సృష్టించడమే టీడీపీ పాలసీ

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

 

అసెంబ్లీ: అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడుస్తుంటే.. అనేక అంశాలపై చర్చిస్తుంటే సభలో గందరగోళం సృష్టించి ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే ప్రతిపక్షం పాలసీ పెట్టుకుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఐదేళ్లలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ కట్టలేని చంద్రబాబు సుందర నగరాన్ని నిర్మిస్తానని ప్రగల్భాలు పలికాడన్నారు. అసెంబ్లీలో చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లు టీడీపీ సభా సంప్రదాయాలను ఏరకంగా తుంగలో తొక్కారో ప్రజలంతా చూశారన్నారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజాలపై దాడికి కూడా దిగారని గుర్తుచేశారు. కొన్ని మీడియా చానళ్లను రానివ్వడం లేదని ప్రతిపక్షం అంటుందని, సభా సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే ప్రశ్నించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. మీడియా వ్యవస్థను సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీ అని, సత్యదూరమైన అంశాలను ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలని జీవోలో ఉంది కానీ, వాస్తవాలు చెప్పిన పత్రికలపై చర్యలు తీసుకోవాలని లేదన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి చేయలేని చంద్రబాబు ఐదేళ్లలో పెద్ద నగరాన్ని నిర్మిస్తాని ప్రగల్భాలు పలికాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయబోతున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top