రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

 వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి 
 

వైయస్‌ఆర్‌ జిల్లా:  రైతు సంక్షేమమే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో వేరుశనగ విత్తన పంపిణీ ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విపత్తు సమయంలోను రైతులకు ఇబ్బందులు కలగకుండా  వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. నియోజక వర్గానికి 18290.4 క్వింటాళ్ల  వేరుశనగ విత్తనాలును ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. 40 శాతం సబ్సిడీతో విత్తనాలు అందుతాయన్నారు. 30 కేజీ ల బస్తా  ధర  రూ.1413 రూపాయలన్నారు. గ్రామ సచివాలయల వద్దనే విత్తనాల పంపిణీ జరుగుతుందన్నారు. గతంలో మాదిరి విత్తనాల కోసం నిరీక్షణ, కష్టాలు ఇక వుండవన్నారు.  వేరుశనగ  పంట వేయాలనుకున్న ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పంపిణీ ని పారదర్శకంగా  చేపట్టాలన్నారు. ప్రభుత్వం  వేరుశనగ కు మద్దతు ధర రూ.61 ప్రకటించి నియోజక వర్గ వ్యాప్తంగా 6730.15 క్వింటాళ్ల వేరుశనగ ను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.వర్షాలు సంవృద్దిగా కురిసి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విత్తన పంపిణీ లో ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరోనా నేపథ్యంలో  భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రతలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 
 

Back to Top