బియ్యం ఎగుమతిలో అక్రమ వ్యవహారం లేదు

కాకినాడ  ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి  

కాకినాడ పోర్టులో అంతా సవ్యంగా జరుగుతోంది..టీడీపీది దుష్ప్రచారం  

పత్రికల్లో కధనాలు రాయించి వాటిపై మాట్లాడుతున్నారు

పట్టాభి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో

మా కుటుంబ చరిత్ర ఏమిటో జిల్లా వాసులకు తెలుసు

 

కాకినాడ: బియ్యం ఎగుమతిలో అక్రమ వ్యవహారం లేదని కాకినాడ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్ర‌చారాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. శుక్ర‌వారం కాకినాడ‌లో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

డ్రగ్స్‌తో ముడిపెట్టి సిగ్గు పడ్డారు:
    రెండు మూడు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్‌తో ఆంధ్రకు ఏ మాత్రం సంబంధం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పిన తర్వాత టీడీపీ నేతలు లోకోష్, పట్టాభి, వర్ల రామయ్య వంటి వారు సిగ్గుతో తల దించుకున్నారు.

ఇప్పుడు మళ్లీ అసత్యాలు:
    నిన్న ఈనాడులో కధనం రాస్తే, కాకినాడ నుంచి బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆ స్టోరీ పట్టుకుని ఇవాళ ఆరోపించారు. దాంట్లో మాపైనా, పా అధినేతపైనా అసత్య ఆరోపణలు చేశారు. వారి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కుటుంబ చరిత్ర ఏమిటో జిల్లా వాసులందరికీ తెలుసు. పట్టాభి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలి.
    కాకినాడ నుంచి ఎగుమతి అవుతున్న బియ్యంలో ఎక్కడా అవినీతి లేదు. దాంతో రైస్‌ మిల్లర్లకు సంబంధం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. నాపేరు కూడా ఆ మూర్ఖుడు పట్టాభి ప్రస్తావించాడు.
    కాకినాడ నుంచి గత 20 ఏళ్లుగా బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యాంకరేజ్‌ పోర్టు ఉంది. అందుకే ఇక్కడి నుంచి బియ్యం రవాణా ఎక్కువ చేస్తారు. ఈ విషయాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు తెలుసుకోవాలి.

నూకలు. బాయిల్డ్‌ రైస్‌:
    కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్‌ బియ్యంతో పాటు, సన్నబియ్యం ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. కానీ సన్నబియ్యం ఎవరూ ఎగుమతి చేయరు. వాటిని ఎవరూ తీసుకోరు. కాకినాడ పోర్టు నుంచి కేవలం నూకలు, పార్‌బాయిల్డ్‌ బియ్యం మాత్రమే ఎగుమతి జరుగుతోంది. అవి పీడీఎస్‌లో ఉండవు.

ఈ స్థాయిలో ఎగుమతులు:
    2018లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1.74 లక్షల టన్నుల బియ్యం, 7.51 లక్షల టన్నుల నూకలు ఎగుమతి అయ్యాయి. అదే విధంగా 8.54 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతి అయింది. ఇటీవల 4.68 లక్షల టన్ను నూకలు, 8.36 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతి అయింది.

ఆ దేశాలకే వెళ్తాయి:
    ఇక ఐవరీ కోస్టులో వ్యాపారం ఉందని, అక్కడికి బియ్యం ఎగుమతి చేస్తున్నామని మూర్ఖుడైన పట్టాభి ఆరోపించాడు. భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి ఒక్క బియ్యం గింజ ఆఫ్రికా దేశాలకు పోతుంది. ఎందుకంటే వారికి అదే ప్రధాన ఆహారం. కొద్దిగా ఇండోనేషియాకు కూడా బియ్యం ఎగుమతి చేస్తారు.

అన్నీ పెద్ద కంపెనీలే:
    ఇక్కడి నుంచి బియ్యాన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎగుమతి చేస్తాయి. సింగపూర్‌కు చెందిన ఓలమ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఒకటి ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. ఇక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేస్తోంది.
అదే విధంగా మయామ్‌ కంపెనీ. ఇది కూడా సింగపూర్‌ కంపెనీ. ఇంకా భారత్‌కు చెందిన అతి పెద్ద కంపెనీ ఐటీసీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే బియ్యం ఎగుమతి చేస్తోంది.
    ఇంకా సత్యం బాలాజీ, కెఎల్‌ ఇండియా.. ఈ రెండూ కూడా పెద్ద కంపెనీలు. కొన్ని దశాబ్ధాలుగా బియ్యం ఎగుమతి చేస్తున్నాయి.
జగన్‌గారు సీఎం అయ్యాక, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతున్నాయి. అందుకే బియ్యం ఎగుమతి పెరిగింది. ఐవరీ కోస్టులో కూడా విశాఖలో మాదిరిగా చాలా పెద్ద పోర్టు ఉంది. ఎంత పెద్ద షిప్‌ అక్కడికి పోయినా, మూడు, నాలుగు రోజుల్లో అన్‌లోడ్‌ అవుతుంది.

వాస్తవాలు తెలుసుకోండి:
    అవినీతి రహిత ప్రభుత్వం సీఎం లక్ష్యం. అందరం ఆయన బాటలో నడుస్తున్నాం. టీడీపీ హయాంలో అంతులేని అవినీతి జరిగింది. అందుకే మీరు ఇప్పుడు అవే మాటలు మాట్లాడుతున్నారు.
    పట్టాభి ఆరోపిస్తున్నాడు.. మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి బియ్యం  రావడం లేదని. ఒరేయ్‌ పిచ్చోడా.. చత్తీస్‌గఢ్‌లో పోర్టు లేదు. అక్కడి నుంచి రోజూ రైల్వే వ్యాగన్లలో కాకినాడకు బియ్యం వస్తోంది. ఇక్కడికే ఎందుకు వస్తుందంటే, ఇక్కడే ఎగుమతి చేయడానికి తగిన పోర్టు, యాంకరేజ్‌ ఉంది. ఇకనైనా దుష్ప్రచారం మానండి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోండి.

డ్రగ్స్‌ దందా మీదే:
    ఇక్కడ కొండబాబు అనే లోకల్‌ మాఫియా డాన్‌ ఉన్నాడు. ఆయన వల్లే ఇక్కడ గంజాయి వ్యాపారం జరుగుతోంది. ఇటీవల టీడీపీ బృందం ఇక్కడ పర్యటించి షో చేసి వెళ్లారు. మామీద లేనిపోని ఆరోపణలు చేశారు. మేము డ్రగ్స్‌ మాఫియా అన్నారు. దానికి మేము గట్టిగా సమాధానం చెబితే, అసెంబ్లీలో టీడీపీ సమాధానం చెప్పుకోలేకపోయింది.
    టీడీపీ వారికి కూడా ఒకటే చెబుతున్నాను. మీరు మొరగండి. కానీ సరైన దొంగను చూసి మొరగండి. మీ పక్కనున్న చంద్రబాబే పెద్ద దొంగ. కాబట్టి ఆయనను చూసి మొరగండి ముందు. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.

చెడ్డ పేరు తేవొద్దు:
    ఈ సందర్భంగా మరోసారి ఈనాడు పత్రికకు, ఆంధ్రజ్యోతికి ఒకటే చెబుతున్నాం. ఏదైనా రాసే ముందు ఆలోచించండి. రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా చూడండి. మరోసారి కాకినాడ పట్టణం గురించి కానీ, ఇక్కడి పోర్టు గురించి కానీ ఇలా తప్పుడు వార్తలు రాస్తే ఊర్కోబోమని, అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని స్పష్టం చేస్తున్నాం. ఆ రెండు పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే వార్తలు రాస్తే, వాటిని పట్టుకుని ఈ పనికిమాలిన వాళ్లు ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

ఓర్వలేకపోతున్నారు:
    డ్రగ్స్‌ గురించి ఎంత అసత్య ప్రచారం చేశారు. అలా కాకినాడకు ఎంత చెడ్డ పేరు తెచ్చారు. అవన్నీ చూశాం. అంతా మంచి జరుగుతుంటే ఓర్వలేక ఇవన్నీ చేస్తున్నారు. ఒక విషయం సవాల్‌ చేసి చెబుతున్నాను. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ రైతులకు మద్దతు ధర లభించడం లేదు.. అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top