చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం దౌర్భాగ్యం

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
 

కాకినాడ: చంద్రబాబు లాంటి వ్యక్తి  రాష్ట్రంలో పుట్టడం మన దౌర్భాగ్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.  చంద్రబాబు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తి అయితే కృష్ణానది కరకట్టపై ఇన్నాళ్లు ఎందుకు నివాసమున్నారని ప్రశ్నించారు.పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడుతుందని మండిపడ్డారు.ఇళ్ల స్థలాల కోసం సేకరించిన పోర్టు భూములను అడవులని సాకుగా చూపి టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించారన్నారు.లాక్‌డౌన్‌ ఎత్తివేశాక టీడీపీ తీరుపై లబ్ధిదారులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

Back to Top