పుట్టపర్తి: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, సీఎం వైయస్ జగన్ ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల మేర ఆర్థిక సాయం అందించినట్లు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చివరకు టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలనూ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఆదుకున్నారని చెప్పారు. బాధిత కుటుంబాలు గౌరవంగా బతుకుతున్నాయని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకునే పేరుతో అల్లరి చేసేందుకే వస్తున్నారని దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. కొత్తచెరువుకు చెందిన రైతు రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటే 17 రోజుల్లోనే రూ.7 లక్షలు అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ పర్యటన ఎవ్వరిని ఉద్దరించేందుకని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించలేదన్నారు. టీడీపీ పాలనలో రైతు ఆత్మహత్యలపై నోరు మెదపని పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ పేరుతో ఇప్పుడు రాజకీయ డ్రామాలకు తెర తీశారని విమర్శించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాజకీయ లబ్ధి కోసమే పవన్ పర్యటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 మందికి రూ.11.95 కోట్లు మా ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. గతంలో 110 మంది రైతు కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఎగొట్టారని. టీడీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిహారం అందజేసిందన్నారు. ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేనని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తెలిపారు.