వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో రైతుల‌కు భ‌రోసా

ఆర్బీకే ప్రారంభోత్స‌వంలో ఎమ్మెల్యే డాక్ట‌ర్ సిద్ధారెడ్డి

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో రైతుల‌కు చ‌క్క‌ని భ‌రోసా ల‌భించింద‌ని క‌దిరి ఎమ్మెల్యే డాక్ట‌ర్ పీవీ సిద్ధారెడ్డి పేర్కొన్నారు.  నంబులపూలకుంట -2 సచివాలయం పరిధిలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వ్యవసాయానికి పెద్ద పీట వేశారని,  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాల‌ను  అందుబాటులో ఉంచారన్నారు.  ఒకనాడు విత్తనాకాయలను తీసుకోవాలంటే మండల కేంద్రంలో రోజుల తరబడి రైతులు వేచి ఉండే పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితికి విముక్తి కలిగించి రైతు భరోసా కేంద్రాలలోనే విత్తన కాయలను అందుబాటులో ఉంచార‌న్నారు. వ్యవసాయసానికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, క్రిమిసంహారక మందులను సబ్సిడీ ధరలకు అందజేయడం,  రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు భరోసా కేంద్రంలోని ప్రభుత్వం కొనుగోలు చేసేయడం జరుగుతున్నదన్నారు.  గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు రైతులను మోసం చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.  నేడు ఆ పరిస్థితికి పూర్తిగా స్వస్తి చెబుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతున్నదన్నారు. అనంతరం మంచి భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ ను దృశ్యాలువతో సన్మానించి అభినందించారు. 

Back to Top