అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య ప్రదాత అని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. నల్లచెరువు మండలం, అల్లుగుండు గ్రామ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ మునుపెన్నడూ లేని విధంగా వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ప్రతి కుటుంబానికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇంటి వద్దకే అందించే కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేడు మరో అడుగు ముందుకు వేసి అద్భుతమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా వైద్య సిబ్బంది సందర్శించడమే కాకుండా వారికి అవసరమైన వైద్య సదుపాయాన్ని కల్పించడం జరుగుతున్నదన్నారు. నాడు పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందజేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ అన్నారు. దివంగత మహానేత శ్రీ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వారి అడుగుజాడలలో నడుస్తూ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే కొన్ని దుష్ట చతుష్టాయాలు బురద చల్లే కార్యక్రమాలు చేపట్టి వారే బురదలో పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సును మరిచి తన జోబు నింపుకునే కార్యక్రమాలు చేశారని, దానికి ప్రతిఫలంగా నేడు జైలు పాలయ్యారు అన్నారు. ప్రజా సొమ్మును దోచుకుంటే ఎవరికైనా అదే గతి పడుతుందని హితవు పలికారు. రూ. 187 లక్షలతో నిర్మించిన తారు రోడ్డు ప్రారంభం నల్లచెరువు మండలం, నడింపల్లి వద్ద దామవాండ్లపల్లి నుండి నల్లజోడువారిపల్లి వరకు 4 కిలోమీటర్ల మేర రూ. 187 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డు ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ సహకారంతో 4 కి.మీ పాటు రూ. 187 లక్షల రూపాయలతో దామవాండ్లపల్లి నుండి నల్లజోడువారిపల్లి రోడ్డును నిర్మించుకున్నామన్నారు. దశాబ్దాల కాలం నుండి కలగానే మిగిలిపోయిన 130 కి పైగా గ్రామాలకు అప్రోచ్ రోడ్లను 100 సంవత్సరాల మన్నిక కలిగిన రోడ్లను నిర్మించామన్నారు. జగనన్న అధికారం చేపట్టిన నాటినుండి ఆనాడు తన పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలుపరచడమే కాకుండా, తాను చెప్పని హామీలను కూడా నెరవేర్చారన్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందా అని ఒకసారి ప్రజలు ఆలోచించాలన్నారు. అనుభవం అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అనుభవం ఎట్టిదో ఇప్పుడు తెలుస్తున్నదన్నారు. ప్రజాధనాన్ని దండుకోవడంలో అనుభవిజ్ఞుడిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారన్నారు. కాబట్టి ప్రజలంతా జగనన్న ను ఆశీర్వదించాలని తెలిపారు.