శ్రీ కూర్మ‌ క్షేత్రాభివృద్ధికి కృషి

 వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

 పాలక మండలి ప్రమాణ స్వీకారం

శ్రీకాకుళం: ఆది కూర్మావతారం వెలసిన క్షేత్రం, ప్రసిద్ధ పుణ్య ధామం శ్రీ కూర్మ క్షేత్రాభివృద్ధికృషికి కృషి చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శాసన సభ్యులు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకూర్మం దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం శ్రీకూర్మనాధ ఆలయంలో ఘనంగా జరిగింది. పాలక మండలి సభ్యుల చేత దేవాదాయ శాఖ ఏసీ శ్రీరిష ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం తరువాత పాలక మండలి ఏర్పాటు శుభ పరిణామం అని, అదేవిధంగా దాతల  సహకారం అందుకుని ఉగాది నాటికి నిత్యాన్నదాన పథకం ఆరంభానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. ఆలయానికి వందల ఏళ్ల  చరిత్ర ఉందని, చారిత్ర నేపథ్యం దృష్ట్యా ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిందని, పితృకాండలకు ప్రసిద్ధి చెందిన ఆలయంగానే కాకుండా, రాష్ట్రంలోనే ఏకైక ఆది కూర్మ క్షేత్రంగా వినుతికి ఎక్కిందని గుర్తు చేసుకున్నారు.విశిష్టాద్వైతం అలరారిన ప్రదేశం ఇది అని అన్నారు.వీటన్నింటి దృష్ట్యా క్షేత్రంకు ఉన్న గొప్పదనం మరింత పెంపొందించేందుకు పనిచేయాలని కోరారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు వారికి ఆహార సదుపాయాలు ప్రసాదం మాదిరి అందించేందుకు దేవస్థానం వారు సిద్ధపడుతున్నారు. అందుకుగాను దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతలు కోరుకున్న రోజున వారి పేరిట అన్నదానం చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన ఉన్న కోనేరు అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. దేవస్థానం ఆస్తులు కొంతమేర అన్యాక్రాంతం అయి ఉన్నాయ‌ని, ఆ రోజు దాత‌లు ఏ ప్ర‌యోజ‌నం ఆశించి ఇచ్చారో  అది ఇప్పుడు నెర‌వేర‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆల‌యానికి ఆదాయం ఇచ్చే ఆస్తుల పెంపుద‌ల‌కు కృషి చేయాల‌ని, ఏమ‌యినా అవ‌సరం ఉంటే తాను కూడా స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో అంధవరపు సూరిబాబు, ఎస్విడి మురళి చెరో 50000,  ట్రాఫిక్ జామ్ శ్రీనివాస్ 20000 చెక్కులను ఎమ్మెల్యే ధర్మాన చేతుల మీదుగా దేవస్థానం అధికారులకు అందించారు.

పాలక మండలి సభ్యులు వీరే... 
పాలక మండలి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరించనుండగా,సభ్యులుగా డబ్బీరు శ్రీనివాసరావు,ముంజేటి అప్పలకొండ,బోర కృష్ణవేణి,కొండ లక్ష్మి,అనుపోజు నాగరాజు,ఉప్పాడ రమేష్, పూడి కమల,గోరు శ్యామలరావు, సిహెచ్.సీతారామ నర్సింహ చార్యులు వ్యవహరించనున్నారు.ట్ర‌స్ట్ బోర్డ్ ప్ర‌త్యేక ఆహ్వానితులుగా పొన్నాడ రుషి నియ‌మితుల‌య్యారు.

బరాటం రామశేషు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, డిఆర్వో దయానిధి, 
రాష్ట్ర కాపు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఈవో ఎస్. విజయకుమార్, సర్పంచ్ గోరు అనిత, మాజీమున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, ఎంపిపి గోండు రఘురాం, మాజీడీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, రాష్ట్ర నాటక కమిటీ డైరెక్టర్ ముంజేటి కృష్ణమూర్తి, అంబటి శ్రీనివాసరావు, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాతబాబు, చల్లా రవికుమార్, బరాటం నాగేశ్వరరావు , యల్లా నారాయణ, కొయ్యనా నగభూషన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
 
 

తాజా వీడియోలు

Back to Top