స్వ‌చ్ఛ సంక‌ల్పంలో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి

 క్లాప్‌ కార్య‌క్ర‌మంలో ధర్మాన ప్రసాదరావు పిలుపు

నగర పాలక సంస్థ కి చెందిన చెత్త త‌ర‌లింపు వాహ‌నాల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మాన

శ్రీ‌కాకుళం: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వామ్యం కావాల‌ని ఎమ్మెల్యే  ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. మ‌న ప్రాంతాల‌ను మ‌న‌మే ప‌రిశుభ్రంగా ఉంచుకుందామ‌న్నారు. క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డు వ‌ద్ద ఏర్పాటు చేసిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర పాలక పరిధిలో చెత్త త‌రలించేందుకు వ‌చ్చిన వాహ‌నాల‌ను శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ ధర్మాన ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా ధర్మాన మాట్లాడుతూ..ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దామన్నారు. ఆరోగ్య వంత‌మైన సమాజం నిర్మించేందుకు జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మం ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఎవ‌రికి వారే బాధ్య‌త‌గా ఉంటూ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. శ్రీకాకుళం నగర పాలక పరిధిలో 52 వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని వెల్ల‌డించారు. వీటి ద్వారా ప్ర‌తి వార్డు ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, స్వ‌చ్ఛ శ్రీకాకుళం నిర్మాణానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. సానిటరీ సెక్రటరీ లదే కీలక పాత్రరని, వాలంటీర్ల తో కలిసి వారి పరిధిలో ఉన్న జనాలకు అవగాహన కల్పించాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం- క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా శ్రీకాకుళం కార్పొరేషనలో మొదటి విడతగా ప్రారంభించినట్టు తెలిపారు.

కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మాజీమున్సిపల్ చైర్మన్లు మెంటాడ పద్మావతీ, పెడిశెట్టి జయంతి,  పట్టణఅధ్యక్షులు సాధు వైకుంఠరావు, చల్లా శ్రీనివాసరావు, మెంటాడ స్వరూప్, చౌదరి సతీష్, మత్స్యకార డైరెక్టర్ మైలపల్లి మహాలక్షి, నక్క రామరాజు, కోణార్క శ్రీనివాసరావు,  మండవిల్లి రవి, అంధవరపు ప్రసాద్, ఊన నాగరాజు, ముకళ్ల తాతబాబు, అంధవరపు రామ, పొన్నాడ ఋషి, తారక, రఫీ, బైరి మురళి,  జేఎమ్ శ్రీనివాస్, డి. నాని, అంధవరపు రమేష్, టి. బాలకృష్ణ, వానపల్లి రమేష్, ఎండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top