వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

 మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టమని, వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని  మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఇవాళ నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భూ హక్కు– భూ రక్ష బహిరంగ సభలో కృష్ణదాస్‌ మాట్లాడారు.

ఈ రోజు చారిత్రాత్మకమైన మన ప్రియతమ నాయకులు వైయస్‌ జగన్‌ నరసన్నపేటకు వచ్చిన శుభసందర్భం.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించడంతో రాష్ట్రంలో వినూత్నమైన పాలన రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో అనేక ముఖ్యమంత్రులను చూశాం. కానీ ప్రజల తాలుకా ఆకాంక్షలను అనుసరించి  పాలించే నాయకుడు, ఈ ప్రజాసంకల్పయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. అలాంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. అలాంటి మహానాయకుడు ఇవాళ నరసన్నపేటకు రావడం మన అదృష్టం.

ఆయన నాయకత్వంలో ఎప్పుడో బ్రిటిష్‌ సమయంలో జరిగిన సర్వే కాకుండా రైతులకు స్పష్టమైన కొలతలతో భూ రికార్డులు ఉండాలని ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ రీ సర్వే కార్యక్రమం, వైయస్‌ఆర్‌ జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం జగ్గయ్యపేటలో 2020లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి రైతులకు భూ యజమానులకు సంపూర్ణ రక్షణతో భూ రికార్డులు ఇవ్వాలని పరిణతి చెందిన రాజకీయ నాయకుడుగా ఆలోచించి  ఇవాళ పత్రాలు అందజేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న అనేక భూ తగాదాలకు ఈ కార్యక్రమం పరిష్కారం చూపుతోంది. పెద్ద ఎత్తున సుమారు రూ.1000 కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నారు. మీరందరు నన్ను నాలుగు సార్లు అసెంబ్లీకి పంపిస్తే మన ముఖ్యమంత్రి ఆశీర్వచనంతో మొదట ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా, ఆ తరువాత రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి పదవి ఇచ్చి ఇటువంటి భూ రక్ష పథకం, ఇళ్లు లేని పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నాకు అవకాశం కల్పించిన మహా నాయకుడు వైయస్‌ జగన్‌.

వైయస్‌ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇవాళ జగనన్న అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు పాదయాత్రలో పింఛన్లు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతానని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి అవకాశం కల్పిస్తున్నారు. వైయస్‌ జగన్‌కు చంద్రబాబుకు పోలికే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరూ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పేద రైతుల కోసం, కౌలు రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను ఆదుకుంటే అంతకంటే మిన్నగా వైయస్‌ జగన్‌ రైతు భరోసా ఇచ్చి రైతుకు అండగా నిలిచారు. దేశంలోనే అక్షరాస్యతలో మిన్నగా ఉండాలని నాడు–నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చిన మహోన్నత నాయకుడు వైయస్‌ జగన్‌. వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మన ఆసుపత్రికి కూడా రూ.12 కోట్లు ఇచ్చారు. సంపూర్ణంగా రాష్ట్రంలో అన్ని వైద్య నియామకాలు చేయమని సీఎం ఆ దేశాలు ఇస్తే నా ఒళ్లు పులకించింది. ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలి. ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అచ్చెన్నాయుడు కళ్లు లేని కబోదిలాగా మాట్లాడుతున్నారు. వైయస్‌ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పని చేసే నాయకుడు మనకు దొరికారు. ఆయన బిడ్డగా వైయస్‌ జగన్‌ అనేక విషయాలపై శ్రద్ధతో పాలన కొనసాగిస్తుంటే ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాట్లాడుతున్నారు.అచ్చెన్నాయుడు ఈ పథకం అవుతుందా అని సభలో మాట్లాడారు. అప్పుడే నేను అసెంబ్లీలో మీకు, మీ నాయకుడికి ఇలాంటి ఆలోచన రాదు. మా నాయకుడు చేస్తానంటే చేసి చూపుతారని అసెంబ్లీలో ఆ రోజే చెప్పాను. అలాంటి పిరికిపందలు ఏ మంచి పనులు చేయలేరు. మా నాయకుడు సింహం పిల్ల.  ఒక మాట చెబితే తూచా తప్పకుండా నెరవేర్చుతారు. బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌ బోన్‌ అని కొత్త నిర్వచనం చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది. నాలాంటి సామాన్యుడికి రెవెన్యూ శాఖ ఇచ్చారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 800 మందిని డైరెక్టర్లుగా చేశారు. ఇవన్నీ చూసి ప్రతిపక్షాలు భయంతో మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. 
నరసన్నపేటలోని రాజుల చెరువును ఆధునీకరించాలని, మేజర్‌ పంచాయతీలో 20 లక్షల మందికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన సీఎం రూ.4 కోట్లు ఇచ్చారు. మరో రూ.10 కోట్లు ఇస్తే బాగుంటుంది. లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ను కోరారు. నిర్లక్ష్యానికి గురైన మా ప్రాంతం అభివృద్ధికి దోహదపడాలని ధర్మాన కృష్ణదాస్‌ సీఎం వైయస్‌ జగన్‌ను కోరారు. ట్రైబల్‌కు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇళ్లు నిర్మంచే అవకాశం కల్పించాలని, ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా వైయస్‌ఆర్‌సీపీ కోటాలో ఉండాలని, ఎవరు పోటీ చేసినా వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించాలని ధర్మాన కృష్ణదాస్‌ ఆకాంక్షించారు. 
 

Back to Top