సీఎం వైయస్‌ జగన్‌ కూడా అంతే గొప్ప వ్యక్తి 

చంద్రబాబు మనవడు ఏ బడిలో చదువుతున్నారు?

స్వార్థం కోసం టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

ఎమ్మెల్యే ధనలక్ష్మీ

అసెంబ్లీ: పురాణాల ప్రకారం రాముడు, పాండవులు ఎంత గొప్ప వ్యక్తులో..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అంతే గొప్ప వ్యక్తి అంటూ ఎమ్మెల్యే ధనలక్ష్మి అభివర్ణించారు. అరణ్యవాసం చేసినంత మాత్రాన వారు చెడ్డవారు కాలేదు..వైయస్‌ జగన్‌ జైలుకు వెళ్లినంత మాత్రానా చెడ్డవారు కాదని..ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారని తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియంపై సభలో ధనలక్ష్మీ మాట్లాడారు. బ్రిటీష్‌ వాళ్లు అన్ని సంవత్సరాలు మన దేశాన్ని పాలించారని, అంత మాత్రాన తెలుగు అంతం కాలేదన్నారు.  2600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషపై టీడీపీ నేతలకు ప్రేమ ఉంటే మొదటి ప్రాచీన భాషగా గుర్తించాలని ఎందుకు ప్రయత్నం చేయలేదు. 11వ శతాబ్ధంలో నన్నయ్య తెలుగు, ఆంధ్ర పదాలు ఉపయోగించారు. తమిళం కంటే తెలుగు భాష ఎందుకు గుర్తింపు పొందలేదు. తెలుగు భాషకు ప్రాచీక హోదా కల్పించలేదు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో తెలుగు భాషకు మంచి రోజులు రాబోతున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లల్లో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువైంది. చంద్రబాబు గతంలో అన్నారు..నేను 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని కావచ్చు..కానీ 20 ఏళ్ల కుర్రాడిలా ఆలోచన చేస్తా అన్నారు. ఎవరైనా కుర్రాళ్లు ఇప్పుడు తెలుగు మీడియం చదివేందుకు ఇష్టపడుతున్నారా? చంద్రబాబు తన కొడుకు, మనవడిని ఏ మీడియంలో చదివించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఇంగ్లీష్ లోనే సంతకం చేస్తున్నారు. వీరికి తెలుగు మీద ‌ప్రేమ ఉంటే ఎందుకు తెలుగులో సంతకం చేయడం లేదు. నేను తెలుగు టీచర్‌గా నా ప్రయాణాన్ని మొదలు పెట్టానను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగులోనే సంతకం చేస్తున్నాను.ప్రతి ఒక్కరికి తెలుగు అన్నది మనసులో ఉండాలి. ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో తెలుగు భోదించడం లేదు. ఎవరైనా తెలుగులో మాట్లాడితే ఫైన్‌ వేస్తున్నారు. పిల్లవాడు తెలుగు ఒక సబ్జెక్ట్‌ మాత్రమే పెడుతున్నాం. ఇంగ్లీష్‌ మీడియం పెడుతుంటే వ్యతిరేకించే ఈ నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం వైయస్‌ జగన్‌ గోరు ముద్దులు కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు. మంచి విషయాల గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం లేదు. 
నిన్నటి సభలో ప్రతిపక్ష సభ్యులు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కోర్టు అంటూ హేళనగా మాట్లాడారు. ఈ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. వైయస్‌ జగన్‌ ఎందుకు కోర్టుకు వెళ్తున్నారో వీరికి తెలియదా? మద్దర మాటలు విని కైక శ్రీరాముడిని అడవులకు పంపించినట్లుగా చంద్రబాబు మాటలు విన్న సోనియా వైయస్‌ జగన్‌ను జైలు పాలు చేసిన విషయం ప్రతి ఒక్కరూ చూశారు. రామాయణం, భారత చదివారు. రాజ్యంలో ఉన్నంత మాత్రానా రావణుడు గొప్పవాడు కాలేదు. అరణ్యంలో ఉన్నంత మాత్రాన శ్రీరాముడు చెడ్డవాడు కాలేదు. అరణ్యవాసం తరువాత శ్రీరాముడు ఎలా పట్టాభిషేకం పొందారో..ఇన్ని రోజుల కష్టం తరువాత మా జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా నిలిచారు. 151 సీట్లతో వైయస్‌ జగన్‌కు పట్టాభిషేకం చేశారు. భారతంలో కూడా కౌరవుల కుతంత్రాలకు పాండవులు ఏడాది పాటు అజ్ఞాతవాసం చేశారు.ఎవరు ఏంటి? అన్నది కాలం..ప్రజలు నిర్ణయించాలి. ఆ నిర్ణయం ప్రజలు చేశారు కాబట్టే ఈ రోజు ప్రజలు వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. పురాణాల ప్రకారంగా రాముడు, పాండవులు ఎంత గొప్పవాళ్లో వైయస్‌ జగన్‌ కూడా అంతే గొప్పవారు. తెలుగు భాష అన్నది ఎవరో నాశనం చేస్తే..నాశనం కాదు..నాశనం చేయాలని అనుకునేవారే నాశనం అవుతారు. ఇంగ్లీష్‌ మీడియం అందరూ చదువుకునే అవకాశం రావాలి. మాది గిరిజన రైతు కుటుంబం. ఆరుగురు సంతానంలో నేను నాలుగో వ్యక్తిని. అందరం చదువుకున్నాం. అందరం కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. అప్పట్లో ఇలాంటి సీఎం ఉండి ఉంటే మేం కూడా ఇంగ్లీష్‌ మీడియం చదివేవాళ్లం. మా పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియంలో బాగా చదువుకోవాలని ఈ బిల్లును మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నాను. 

Back to Top