వైయస్‌ జగన్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటారు

సీఎం వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు

చంద్రబాబులా మేం సంస్కార హీనులం కాదు

మేధావుల కోసం వైయస్‌ఆర్‌ మండలిని పునరుద్ధరించారు

పప్పులాంటి వ్యక్తుల కోసం చంద్రబాబు మండలిని వాడుకున్నారు.

చంద్రబాబు ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు

ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

తాడేపల్లి: తండ్రి పేరు నిలబెట్టే ప్రతి కుమారుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. వైయస్‌ జగన్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. మా నాయకుడి మీద ప్రేమతో మేము ఎప్పుడు అసెంబ్లీకి హాజరవుతాం. చంద్రబాబూ..రోజు మీ ఎమ్మెల్యేలు ఎంత మంది అసెంబ్లీకి వస్తున్నారో తెలుసా? నీకు మీ ఎమ్మెల్యేలపై నమ్మకం ఉందా? రోజు అసెంబ్లీకి రండి బాబు అని బతిమిలాడుకుంటున్నావు. ప్రతి ఒక్కరిపై అనుమానామే. ప్రతి ఎమ్మెల్యేకు నీపై అనుమానామే.  చంద్రబాబు వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై వైయస్‌ జగన్‌ ఎప్పుడో చేయి చేసుకున్నారని, ఆ విషయం రోశయ్య చెప్పినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఈ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మన రాష్ట్రం మొత్తం మీద ప్రతి కొడుకు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే వైయస్‌ జగన్‌ను తీసుకుంటారు. తండ్రి పేరు ఎలా నిలబెట్టాలో తెలుసుకోవాలంటే వైయస్‌ జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంత అదృష్టవంతులంటే..ప్రతి పేదవాడు వైయస్‌ఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలు చిరాకు పడుతారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్‌ జగన్‌ను చంద్రబాబు ఎన్ని బాధలు పెట్టారు. ఈ రోజు చంద్రబాబు తన కాన్వయ్‌తో, పెద్ద సెక్యూరిటీతో తిరుగుతున్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌కు చంద్రబాబు డొక్కు కారు ఇచ్చారు. ప్రజలు వైయస్‌ జగన్‌పై పడుతున్నారంటే కూడా వినిపించుకోలేదు..సెక్యూరిటీ పెంచలేదు. చంద్రబాబు వద్దకు ప్రజలు ఎవరూ రారు..ఎందుకంటే ఏదైనా అంటుకుంటుందని భయం. వైయస్‌ జగన్‌ గురించి చంద్రబాబు దిగజారి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మేం కూడా మాట్లాడగలం. కాకపోతే మాకు సంస్కారం అడ్డొస్తుంది. నీలాగా సంస్కారహీనులం కాదు.
ఈ రోజు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నాడు. శాసన మండలి గురించి రకరకాల నీతులు చెబుతున్నాడు. ఆ రోజు వైయస్‌ఆర్‌ శాసన మండలిని పునరుద్ధరించినప్పుడు అందులో మేధావులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ రోజు చంద్రబాబు మండలిలో ఎలాంటి వాళ్లను కూర్చోబెట్టారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలోని వ్యక్తి బుద్దా వెంకన్న, నారా లోకేష్‌, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన యనమల రామకృష్ణుడు వంటి సన్యాసులు మండలిలో ఉన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ విషయంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన భుజస్కందాలపై నిలబడిన ప్రభుత్వం ఇదీ. మా ప్రభుత్వం గురించి ఎంతో గొప్పగా చెప్పుకోగలం. చంద్రబాబులా వెన్నుపోటు పొడిచి లాక్కున్న ప్రభుత్వం కాదు మాది.
చంద్రబాబు నోరు తెరిస్తే చాలు..అసెంబ్లీ రద్దు చేయమని అంటున్నాడు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు గ్రేట్‌ చైనా వాల్‌ కట్టినట్లు ముఖ్యమంత్రి కాకుండా చేశారు. ఇక కలలో కూడా చంద్రబాబు సీఎం కాలేరు. శాశ్వత సమాది ప్రజలు కట్టారు. అలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెబుతున్నావు. కర్నూలుకు హైకోర్టు ఇస్తామని కేంద్రం చెబితే మేం స్వాగతిస్తామని చంద్రబాబు అంటున్నారు. అంతకు ముందేమో అమరావతి నుంచి ఒక్క అడుగు కూడా కదిలించలేరు అన్నారు. చంద్రబాబు ఎందుకీ రెండు నాల్కల ధోరణి. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెడదామంటే చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే ఎందుకంత కక్ష. టీడీపీలో 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు నెలల్లో ఎంత మంది ఉంటారో చెప్పగలవా?. 2009 నుంచి వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నాం. నీ ఎమ్మెల్యేలపై డౌట్‌తో నీవుంటావ్‌. చంద్రబాబు, యనమల ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. యనమల రామకృష్ణుడు కమర్షియల్‌ ట్యాక్స్‌ మినిస్ట్రర్‌గా పని చేస్తున్న సమయంలో  తన ఓత్‌ స్వప్రయోజనాల కోసం పదవిని ఉపయోగించుకొనని ప్రమాణం చేశారు.   కమర్షియల్‌ బిల్డింగ్‌కు వేలల్లో అద్దె ఉంటే..దాన్ని లక్షల్లోకి మార్చి తునిలో తన తమ్ముడి కాంప్లెక్స్‌లోకి మార్చుకున్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే యనమలకు రెండేళ్లు జైల్‌ శిక్ష పడుతుంది.ఈ పెద్ద మనిషి అందరికి పేర్లు పెడతారు..నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతారు. గతంలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు ఇద్దరు కలిసి స్పిన్నింగ్‌ మిల్‌ యూనియన్‌ నాయకుల వద్ద సుమారు రూ.25 కోట్లు వసూలు చేశారు.  వారి పని చేయించకుండా, డబ్బులు పూర్తిగా నొక్కేస్తారు. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు, పాటించడానికి కాదు అన్నట్లుగా ఉంటాయి యనమల నీతులు. శాసన సభలో ఆర్డినెన్స్‌ పెట్టినా అడ్డుకుంటామని యనమల మాట్లాడుతున్నాడు. ఈయన అడ్డుకునేది ఏంటి? ప్రజాస్వామ్యయుతంగా సీఎం వైయస్‌ జగన్‌ నడుచుకుంటున్నారు. మండలిలో మీకు సంఖ్యాబలం ఉందని ప్రజలకు మేలు చేసే బిల్లులు అడ్డుకుంటుంటే చూస్తునే ఉన్నాం. చంద్రబాబు.. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లారు. ఇంక ఎంత మంది నీ వద్ద ఉంటారో తేల్చుకో..చంద్రబాబుకు నీకు ప్రజల మద్దతు ఉందా?

Back to Top