ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మీ అరెస్టు

పోలీసు స్టేషన్‌లోనే దీక్ష కొనసాగిస్తున్న చెవిరెడ్డి

చిత్తూరు: పోలీసుల అరాచకం పరాకాష్టకు చేరింది. దొంగ ఓట్ల నమోదును అడ్డుకున్నందుకు రాత్రి నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌లోనే చెవిరెడ్డి 18 గంటలుగా దీక్ష కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేకు బీపీ, షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో బాగా నీరసించారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన సతీమణి లక్ష్మీ దీక్ష చేపట్టారు. దీంతో చెవిరెడ్డి సతీమణి లక్ష్మీ సమా మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి పోలీసులు అరెస్టు చేసిన వారిలో మహిళా కార్యకర్త శోభ ఆరోగ్యం విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
 

Back to Top