అధైర్యపడ్డొదు..జగనన్న అండగా ఉన్నారు

చంద్రబాబు అబద్ధాపు ప్రచారాలు నమ్మొద్దు

టీడీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది

వైయస్‌ఆర్‌సీపీ పోలవరం అభ్యర్థి తెల్లం బాలరాజు

పశ్చిమగోదావరి:పోలవరానికి నియోజకవర్గానికి వైయస్‌ఆర్‌ కుటుంబానికి అవినావభావ సంబంధం ఉందని వైయస్‌ఆర్‌సీపీ పోలవరం నియోకజకవర్గం అభ్యర్థి తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం నియోజకవర్గం అంటే   వైయస్‌ఆర్‌ అడ్డా లాంటిందన్నారు. వైయస్‌ఆర్‌  పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి దశాబ్దాల కలను నెరవేర్చారన్నారు. వైయస్‌ జగన్‌ మన అందరికి కష్టాలు విన్నారని, అధైర్య పడొద్దని, వచ్చేది మన ప్రభుత్వమే అని, మనకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అండగా ఉన్నారన్నారు.పోలవరం ప్రాజెక్టు పూర్తియితే రాష్ట్రంలో కరువును తరమికొట్టొచ్చని దృఢ సంకల్పంతో ప్రారంభించారని తెలిపారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజక్టుకు గ్రహణం పట్టిందన్నారు.నత్తనడకన పనులు సాగుతున్నాయన్నారు.పోలవరం ప్రాజెక్టుకు నేనే శ్రీకారం చుట్టానని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను నమ్మించడానికి గేట్లుకు శంకుస్థాపన చేస్తారని దుయ్యబట్టారు.ఆయన ఎన్ని రకాలుగా అబద్ధాపు ప్రచారాలు చేసిన పోలవరం నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌  హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని అందించాలని ఆలోచన చేశారని,చంద్రబాబు హయాంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.

Back to Top