ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టండి 

ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పిలుపు

విజ‌య‌న‌గ‌రం:   ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. బుధ‌వారం గొట్లామ్ సత్య ఫంక్షన్ హాల్ లో గజపతినగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం  శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన నిర్వ‌హించారు. ఈ నెల 12న‌ విశాఖపట్నం లో జరగబోయే ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల బ‌హిరంగ సభను విజ‌య‌వంతం చేసేందుకు స‌న్మాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అప్ప‌ల న‌ర‌స‌య్య మాట్లాడుతూ..  గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడమే కాకుండా, జన్మభూమి కమిటీ పేరుతో నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై విశ్వాసంతో ఏకపక్షంగా వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించారని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని తెలియజేశారు. అందులో భాగంగానే గ‌జ‌ప‌తిన‌గ‌రం నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారన్నారు. ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని, టీడీపీ, జ‌న‌సేన కుట్ర‌ల‌ను, త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. స‌మావేశంలో పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు,రఘురాజు , జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభుజీ రాజు ,  నారాయణమూర్తి రాజు, ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాల నాయుడు, డీసీఎంస్ డైరెక్టర్ పి. నారాయణమూర్తి , మిగతా జిల్లా, రాష్ట్ర డైరెక్టర్ లకు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, ఐదు మండలాల ఎంపీపీ లు, జడ్పీటీసీ లు,  గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top