సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయా?

ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్న ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య‌

చిన‌కాద గ్రామంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య

విజ‌య‌న‌గ‌రం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, న‌వ‌ర‌త్నాలు అందుతున్నాయా అంటూ ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య ఆరా తీస్తున్నారు. మంగ‌ళ‌వారం చినకాద గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు,  ఏఎంసీ చైర్మన్ ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హులను గుర్తించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌కారం చుట్టార‌ని తెలిపారు. అర్హులై ఉండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారిని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రిఅప్పలనాయుడు,  జడ్పీటీసీ సభ్యురాలు రౌతు రాజేశ్వరి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అప్పలనాయుడు, పార్టీ మండ‌ల అధ్యక్షులు కడుబండి రమేష్ నాయుడు, సుమల శ్రీను,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top