కుప్పంలో చంద్రబాబు కుట్రలు సాగవు

 ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి  
 

చిత్తూరు: కుప్పంలో చంద్రబాబు కుట్రలు సాగవని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు.  చంద్రబాబు తన సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన టీడీపీని రౌడీయిజంతో సొంతం చేసుకున్నారని  విమర్శించారు. మా నాయకుడు కష్టపడి పాదయాత్ర చేసి ఈ రోజు సీఎం అయ్యారని తెలిపారు. చంద్రబాబు రౌడీయిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కుప్పంలోని నాలుగు మండలాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఈ రోజు జెండా ఎగిరింది. కుప్పంలో చంద్రబాబు రౌడీలను పంపించి ఇక్కడ గుండాగిరి చేశారని తెలిపారు. కుప్పం చేజారిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇక్కడికి పరుగెత్తుకొనివచ్చారన్నారు. కుప్పంలో మంచినీరు లేదు..డ్రైనేజీ సౌకర్యం లేదని తెలిపారు. కుప్పం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, చంద్రబాబు ఇకపై కుప్పం నుంచి పక్కకు వెళ్లాల్సిందేని ఎమ్మెల్యే తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top