30 వేల కుటుంబాలకు కూరగాయల పంపిణీ

మూడో దఫా ఐదు రకాల కూరగాయలు అందిస్తున్న ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్‌రెడ్డి

చిత్తూరు: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్ఫూర్తితో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణ లో 30 వేల కుటుంబాలకు మూడోదఫా 5 రకాల కూరగాయాలను ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్‌రెడ్డి పంపిణీ చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్  రెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి సి విటమిన్ అధికంగా గల 30టన్నుల చీనీపండు(బత్తాయి), మదనపల్లి నుంచి  30 టన్నుల టమోటా, 25 టన్నుల క్యారెట్, అనంతపురం నుండి 20 టన్నుల ఎర్రగడ్డలు, కర్ణాటక నుంచి  20 టన్నుల క్యాబేజీ తెప్పించామన్నారు. వీటిని ప్రతి ఇంటికి పంచి పెట్టామన్నారు. ప్రజలు తనను నమ్మి ఓటు వేసి గెలిపించారని, వారు ఈ రోజు కష్టాల్లో ఉన్నారని,  వారి కష్టాలను తీర్చడానికి తన వంతు ఉడతాభక్తిగా ఈ సహాయం చేస్తున్నానని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top