పరిపాలన వికేంద్రీకరణను అన్ని ప్రాంతాలు స్వాగతిస్తున్నాయి

ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులు సిద్ధమవుతున్నాయి

ఒక్క చంద్రబాబే వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారు

మూడు ప్రాంతాల ఆకాంక్షలను సీఎం వైయస్‌ జగన్‌ తీర్చే ప్రయత్నం చేస్తున్నారు

వైయస్‌ జగన్‌ విధానాలతో అన్ని ప్రాంతాలకు సమ న్యాయం

చంద్రబాబు ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలని చూశారు

వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాక రాయలసీమ వాసుల కష్టాలు తీర్చారు

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు స్వాగతిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వికేంద్రీకరణను ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారని, ఒక్క చంద్రబాబు ఒక్కరే దీన్ని  వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని వివరించారు. అసెంబ్లీలో వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు.

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారు. ప్రజలకు చేరువ చేయాలన్న ఆశలకు అనుగుణంగా వైయస్‌ జగన్‌ తన పాలనను ప్రజలకు చేరువుగా, అనుకూలమైన విధానాలను తీసుకువచ్చారు. 2019 అక్టోబర్‌ 2న సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి 2 వేల జనాభాకు 12 మంది సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఆ కారణంగా ఈ రోజున రాష్ట్రంలోని ప్రజలందరికీ తమ సమస్యలను చెప్పుకోవడానికి సులువైన మార్గం దొరికింది. దేశంలోనే సచివాలయ వ్యవస్థను ఇంత దగ్గరగా తీసుకువచ్చిన ఘనత వైయస్‌ జగన్‌ది. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను నియమించి సంక్షేమ పథకాలను గడప వద్దకు చేరుస్తున్నారు. దాదాపు 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు పాలనను సీఎం వైయస్‌ జగన్‌ చేరువ చేశారు. జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న వారైనా జిల్లా ప్రధాన కేంద్రాన్ని చేరుకోవడం అన్నది అతి సమీపంగా చేశారు. రెవెన్యూ డివిజన్లను గతంలో కంటే ఎక్కువగా పెంచారు. జిల్లాలను పెంచడమే కాకుండా మా రాయలసీమకు సంబంధించి వెంకటేశ్వరస్వామి మీద అనన్య సామన్యమైన రీతిలో 32 వేల కీర్తనలతో అలరారించి స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య గారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం అన్నది గొప్ప ఆలోచన.
బ్రిటిష్‌ వారి గుండెల్లో నిద్రపోయిన అల్లూరి సీతారామారాజు పేరుతో మరో జిల్లా, ఎన్టీఆర్‌ పేరుతో జిల్లాలను ఏర్పాటు చేసి తెలుగు వారి గొప్ప తనాన్ని ఇతర ప్రాంతాలకు తెలిసేలా చేశారు.

పాలనను ప్రజలకు చేరువ చేయడంలో నిజమైన పాలకుడిగా వైయస్‌ జగన్‌ అందరు ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఇప్పటికే 98 శాతానికిపైగా హామీలు నెరవేర్చారు. అధికార వికేంద్రీకరణ ద్వారా ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రజలకు అత్యంత చేరువ చేశారు. ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు పాలన సౌలబ్యాన్ని చేశారు. 
నేను రాయలసీమ వాసిని, అత్యంత ప్రవిత్రమైనతిరుపతి నియోజకవర్గానికి  ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన స్వల్ప వ్యవధి చర్చలో స్పీకర్‌గా ఉన్న సీతారామ్‌ గారి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముఖ్య విషయం చెబుతున్నాను. మా రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం.

మేం చేసిన త్యాగాలు, పోరాటాలు ఎక్కువ, ఫలితాలు తక్కువ. రేనాటి రాయలు ఏలిన రాయలసీమ అర్కాట్‌ నవాబుల కారణంగా, బ్రిటిష్‌ వారి దుర్నితి కారణంగా నిజాం పరిపాలించిన రోజుల్లో పీడనకు గురైన ప్రాంతంగా మారిన రాయలసీమలో 1928వ సంవత్సరంలో ఆనాటి ఆంధ్ర మహాసభ 11వ సమావేశాన్ని నంద్యాలలో జరుపుకున్నాం. బ్రిటిష్‌ వాడు నిజాం నవాబుకు చేసిన స్నేహంతో నిజాం నవాబు తొలుత కొస్తాంధ్ర, గుంటూరు, రాయలసీమ ప్రాంతాలను అమ్మేశారు. మరోరీతిలో రాయలసీమను బ్రిటిష్‌వారికి అమ్మేశారు. ఒక అవమానకరమైన రీతిలో అప్పట్లో పిలిచేవారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కొండ వెంకటప్పయ్య, ప్రకాశం పంతులు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రుల మహాసభ అనంతరం దత్త మండలాల సభ జరిగితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిలుకూరి నారాయణరావు అనే అధ్యాపకుడు ఆ రోజు అనంతపురంలో పని చేసే కాలేజీలో ఒక అవమానకరమైన పదం..రేనాడుగా బాసిల్లిన ప్రాంతానికి దత్త మండలాలు వద్దు..రాయలసీమగా నామకరణం చేశారు. ఈ ప్రాంతానికి రాయలసీమగా నామకరణం చేయడంలో ఆముదాలవలసకు చెందిన చిలుకూరి నారాయణమూర్తి పాత్ర అత్యంత ప్రాముఖ్యమైంది. 

ఆనాడు కాశీవిశ్వేశ్వర నాగేశ్వర పంతులు ఇల్లు చెన్నైలో ఉండేది. ప్రతినిధుల సమావేశం జరిగితే ప్రత్యేక ఆంధ్రుల రాష్ట్రంగా ఏర్పాటు కావాలన్న ప్రతిపాదన జరిగినప్పుడు ఆంధ్ర మహాసభ సమావేశాలపై రాయలసీమ ప్రాంత వాసులకు ఒక అనుమానం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడలనే కోరిక లేదు. 

1639వ సంవత్సం ఆగస్టు 22న మద్రాస్‌ ప్రాంతంతో సహా రాయలసీమను పరిపాలిస్తున్న సామంత రాజైన శ్రీకాళహస్తి జమీందార్‌ చెన్నై అనే ప్రాంతాన్ని ఆరోజున చంద్రగిరి మహాల్‌లో  ఇస్టిండియా కంపెనీకి రాసిచ్చారు. అప్పుడు ఒక ప్రత్యేకమైన నిబంధన చేశారు. ఈ ప్రాంతానికి మా తండ్రి పేరుతో కొత్త పేరు నామకరణంచేయాలని ప్రతిపాదించారు. అందుకే చెన్నపట్నంగా నామకరణం చేశారు. ఈ రకమైన ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ రాయలసీమ వాసులకు మద్రాస్‌తో ఉండేది. ఆ రోజుల్లో మద్రాస్‌ నుంచి విడిపోవాలని ఎవరికి ఉండేది కాదు. ఆనాడే కొప్పురు రామాచారులు ప్రతిపాదించిన మద్రాస్, నెల్లూరు, రాయలసీమతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యి ఉంటే ఈ నాడు దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా రాయలసీమ ఉండేది. ఇది ఒక చరిత్ర.

ఈ చరిత్రను కనుమరుగు చేసి స్వార్థ రాజకీయాలతో ఆనాడు శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేస్తే రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం రాయలసీమకే ఇచ్చారు. మా అందరికి ప్రియమైన నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇంటిపేరే శ్రీబాగ్‌. కారణంతాల వల్ల ప్రత్యేక రాష్ట్రంగా తెలుగు రా ష్ట్రం ఏర్పడిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైంది. రాజధాని కర్నూలు ఉంటే, హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్రమహా సభలో జరిగిన తీర్మానం తరువాత అనంతపురానికి ఆంధ్ర విశ్వ విద్యాలయం తీసుకురావాలని మూజువాణి ఓటుతో తీర్మానించినా విశ్వవిద్యాలయం అనంతపురంకు రాలేదు. రాయలసీమ నష్టపోయింది. త్యాగాలు చేసిన మేం..ఏ అవసరాలను తీర్చాలనే ప్రతిపాదనలు చేశారో అవేవి కూడా వనకూరకుండా పూర్తిగా నష్టపోయాం. ఆతరువాత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే మొదటిసారి రాయలసీమ వాసుల కడగండ్లు, కన్నీరు తుడిచారు. ఆ రోజు శ్రీశైలంప్రాజెక్టు సామర్థ్యం సైజ్‌ను 854 అడుగులకు ఉంచాలని జీవో తెస్తే తద్వారా మాత్రమే రాయలసీమ వాసులకు నీటిపారుదలకు అవకాశం ఉంటుందని భావించారు.

పోతిరెడ్డిపాడు నుంచి విస్తరణ పనులు చేపడితే చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఏనాడు రాయలసీమ గురించి ఆలోచించని చంద్రబాబు..ఈ రోజు వైయస్‌ జగన్‌ మంచి చేస్తుంటే మళ్లీ అడ్డుపడుతున్నారు. 80 శాతానికిపైగా సీట్లు, అత్యధిక ఓట్లతో సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారు. చిత్తశుద్ధి, వినూత్నమైన భావాలతో ఆలోచన చేసి ఒక్క చోటనే రాజధాని ఉంటే ఇతర ప్రాంతాలను నష్టపోతాయని భావించారు. పరిపాలన అంటే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే వైయస్‌ జగన్‌ ధ్యేయం. రాయలసీమ వాసుల సగటుఆరోగ్యం 40 నుంచి 45 ఏళ్లే..ఉత్తరాంధ్రలో అంతకంటే తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశారు. కర్నూలు శాసన సభలో ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే తీర్మానం పెడితే విశాఖలో రాజధాని కావాలని ఓటింగ్‌ పెడితే 60 ఓట్లు వచ్చాయి. ఎన్జీ రంగానే రాయలసీమలో తిరుపతి రాజధాని ఉండాలని కోరుకున్నారు.

హైదరాబాద్‌ శాసన సభలో అమరావతిలో రాజధాని కావాలని కోరుకున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతిలో ఒక రాజధాని ఉండాలని పరిపాలనలో మౌలిక ఆలోచన. ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష. మూడు ప్రాంతాల ప్రజలు కోరుకున్న కోరికను వైయస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. వైయస్‌ జగన్‌కు ఒక ప్రాంతం పట్ల, ఒక సామాజిక వర్గంపై వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు, వారికి సంబంధించిన పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి.

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన పుస్తకంలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు ఉన్నాయని వడ్డే సోమనాద్రిశ్వర్‌ సామాజిక కారణాలు లేవనెత్తారు. దాంట్లో వైయస్‌ జగన్‌ పాత్ర ఏముందో చెప్పాలి. ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖంగా, సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ఆయన ఉద్దేశం. ఒక ప్రాంతం అభివృద్ధిని ఆటంక పరచాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఈ ప్రాంత ప్రజలుకూడా వైయస్‌ జగన్‌ను ఆదరించారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ పార్టీ అత్యధిక మైన సీట్లు గెలుచుకుంది. ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. రాయలసీమ, కొస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. అ భివృద్ధిలో తేడాలున్నాయి. విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. తెలుగు వాళ్లగా మనమంతా ఒక్కటిగా ఉండాలి. వెనుకబడిన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలన్నదే వైయస్‌ జగన్‌ లక్ష్యమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

 
 

తాజా వీడియోలు

Back to Top