అభినవ అల్లూరి జగనన్న

 పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
 

పాడేరు: విప్లవ వీరుడి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసిన మన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అభినవ అల్లూరి అని పాడేరు ఎమ్మెల్యే కొట్ట‌గుళ్లి భాగ్య‌ల‌క్ష్మీ కొనియాడారు. 8 వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ కార్య‌క్ర‌మం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో  నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే, విద్యార్ధులు మాట్లాడారు. 

ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మీ ఏమన్నారంటే... 
అందరికీ నమస్కారం, అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ఈ పుణ్యభూమికి మన జగనన్న రావడం మన అందరి అదృష్టం, ఆ విప్లవ వీరుడి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుచేసిన మన సీఎంగారికి ధన్యవాదాలు. గిరిజన ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు తీరుస్తూ మన గిరిజన హక్కులు కాపాడుతున్న మన అభినవ అల్లూరి జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మీరు వందేళ్ళు చల్లగా ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను, మీ విజనరీ లీడర్‌షిప్‌లో విద్యారంగానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తే ప్రపంచ దేశాల ప్రశంశలు కనిపిస్తాయి, పోటీ ప్రపంచంలో బడుగు బలహీనవర్గాల విద్యార్ధులు కూడా పోటీ పడాలని మీరు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, గ్లోబల్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లీష్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ పేదలకు అందుతోంది, విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధన్యతనిచ్చి మా గిరిజనులకు కూడా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్నారు, చంద్రబాబు బాక్సైట్‌ జీవో 97 తీసుకువస్తే జగనన్న గిరిజనుల పక్షాన నిలబడి అధికారంలోకి రాగానే రద్దు చేశారు, నాడు వైయ‌స్ఆర్‌  గారి హయాంలో అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే నేడు జగనన్న నా పాడేరు నియోజకవర్గంలోనే 1,13,000 మందికి 2,27,000 ఎకరాల భూమిపై హక్కు కల్పించిన ఘనత జగనన్నది, సామాజిక న్యాయానికి సంపూర్ణ అర్ధం చెప్పిన జగనన్నను మేం ఎప్పటికీ మరువం, మీరు సోషల్‌ జస్టిస్‌ రియల్‌ అంబాసిడర్, పారదర్శక పాలన అందించారు, గడప గడపకూ మన ప్రభుత్వంలో అన్ని సచివాలయాలు సందర్శించాను, మా నియోజకవర్గంలో రూ. 1,251 కోట్లు నేరుగా ప్రజల అకౌంట్‌లో జమ అయ్యాయి, మా నియోజకవర్గంలో బ్రిడ్జి నిర్మాణం, కొన్ని పంచాయతీల పరిధిలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతున్నాను. మా గిరిజనులు మీ మేలు ఎప్పటికీ మరువరు, ఏపీ ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారు, థ్యాంక్యూ. 

ధారామణి, ఆశ్రమ పాఠశాల గిరిజన విద్యార్ధిని, చింతపల్లి

అందరికీ నమస్కారం, మా మేనమామ జగన్‌ మామయ్యా హ్యపీ బర్త్‌ డే, మా నాన్న పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడం ఇబ్బందిగా ఉండేది, మీరు సీఎం అయి అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నారు. నేనే కాదు నాలాగా వేలమంది విద్యార్ధులు చదువుతున్నారంటే అమ్మ ఒడి కారణం, ఒకప్పుడు మా స్కూల్‌ సరిగా లేదు మా జగన్‌ మామయ్య సీఎం అయిన తర్వాత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి, మా గిరిజన విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం సార్, మాకు ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చారు, నాకు ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడేదాన్ని, నేను ఇప్పుడు ఇంగ్లీష్‌లో చక్కగా మాట్లాడుతున్నాను, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ చాలా బావున్నాయి, గతంలో స్కూల్‌కు వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు కానీ జగన్‌ మామయ్య సీఎం అవగానే అన్నీ కూడా ఇస్తున్నారు, జగన్‌ మామయ్య మా గిరిజన బిడ్డలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు, మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, రోజుకోరకం మంచి ఆహారం ఇస్తున్నారు, మాకు మంచి ట్యాబ్‌లు ఇస్తున్నారు, ఐఎఫ్‌పీలు ఏర్పాటుచేశారు, మేం చక్కగా చదువుకుంటున్నాం, ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా టాపర్స్‌కు ప్రోత్సాహకం ఇస్తున్నారు, మేం బాగా చదువుకుని మంచి జాబ్‌ వచ్చేవరకూ మీరే మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను మామయ్యా, ధ్యాంక్యూ.

Back to Top