ఎస్సీ, ఎస్టీల సంక్షేమం టీడీపీకి పట్టదా..?

అంబేడ్కర్‌ అంటే గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు

సభలో టీడీపీ తీరుతో రాజ్యాంగం విలపిస్తోంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు

 

అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీకి పట్టదా అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కమిషన్‌ విభజన బిల్లుపై చర్చ జరగకుండా సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలపిస్తుందన్నారు. అసెంబ్లీలో టీడీపీ చేస్తున్న రభసను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు గుర్తుపెట్టుకుంటారన్నారని, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేరన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు డ్రామాలు తెలుసు అని, రాజకీయ స్వార్థం కోసమే టీడీపీ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. అంబేడ్కర్‌ మీద, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా 80 శాతం లబ్ధి పొందింది ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని, ప్రభుత్వం పేదల బాగు కోసం పనిచేస్తుందన్నారు. ఎస్సీ కమిషన్‌ విభజన బిల్లుపై రభస చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. పేద వర్గాలకు గుర్తిండిపోయేలా చంద్రబాబు ఒక్క పథకం అయినా పెట్టారా..? చంద్రబాబు దళితులంటే చిన్నచూపు అని ధ్వజమెత్తారు. ఎస్సీ కమిషన్‌ విభజన బిల్లుపై చర్చ జరగనివ్వకుండా చేస్తే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు టీడీపీ సభ్యులను వీధుల్లో తిరగనివ్వరని హెచ్చరించారు.

Back to Top