ముఖ్యమంత్రి కోసం గిద్దలూరు ఎమ్మెల్యే పాదయాత్ర

ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమల కొండకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఇప్పుడా మొక్కు తీర్చుకోనున్నారు. అర్థవీడు మండలం కాకర్ల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతోంది. ఈ పాదయాత్ర సుమారు 15 రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటుగో 100 మంది కొండపైకి కాలినడకన వెళ్లనున్నారు. వీరంతా స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. 
2019 ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత భారీ మెజారిటీ పొందిన శాసనసభ్యులు అన్నా రాంబాబు. ప్రజా సమస్యలపైనే కాదు, గతంలో అధికార టీడీపీ అకృత్యాలపైనా విరుచుకుపడ్డ సీనియర్ నేత. చంద్రబాబు అక్రమాలపై విచారణ చేయాలని అసెంబ్లీ బైట బైఠాయించిన నాయకుడు. 
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కనుక స్వామివారి మొక్కు తీర్చుకునేందుకు ఎమ్మెల్యే సెప్టెంబర్ 4 బుధవారం నాడు పాదయాత్రగా బయలుదేరుతున్నారు. 

Back to Top