ఓట్ల గల్లంతుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌...

నెల్లూరు:సర్వేల పేరుతో వచ్చేవారికి ఎలాంటి వివరాలు ఇవొద్దని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు గల్లంతు అవుతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Back to Top