ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

 వైయ‌స్ఆర్‌సీపీ వచ్చాక రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు
 

రూ.300 కోట్లతో ప్రభుత్వ సర్వజనాస్పత్రి విస్తరణ

 ఇప్పటికే ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌ స్థలాల కేటాయింపు

 సీఎం వైయ‌స్ జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం

 ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ 

అనంతపురం :  తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పరిపాలనలో అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లు తెలుగుదేశం పార్టీ వాళ్లే గెలిచినా ఐదేళ్ల పాటు వాళ్లు డివైడ్‌ అయి డివైడర్లకే పరిమితం అయ్యారని విమర్శించారు. అనంతపురం నియోజకవర్గంలోని అనంతపురం రూరల్‌ మండలం అభ్యుదయ కాలనీ, లోకేష్‌ కాలనీ, సుశీలరెడ్డి కాలనీల్లో  మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ.. స్థానికంగా కాలువలు, డ్రెయినేజీ సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారన్నారు. కొందరు ఇంటి పట్టాలు కావాలని అడిగారని, తప్పకుండా వాళ్లకు పట్టాలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, కానీ ఐదేళ్ల పాటు ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అప్రదిష్ట చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నగరంలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ చేపట్టనున్నట్లు చెప్పారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ఇప్పటికే ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌ శాఖలకు చెందిన 8.50 ఎకరాలను ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణకు కేటాయించామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ మాట్లాదుతూ ఏ గడప వద్దకు వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వమే మళ్లీ కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న రోజుల్లో మరోసారి వైసీపీ విజయం ఖాయమని.. సీఎంగా వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా అనంత వెంకటరామిరెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ ఓబిరెడ్డి, వైయ‌స్ఆర్‌ సీపీ నేత జయరాం నాయుడు, సర్పంచ్‌ ఉదయ్, ఉప సర్పంచ్‌ సుమిత్రా, ఎంపిటిసి ఆశాజ్యోతి, జేసీఎస్‌ కన్వీనర్‌ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గౌస్‌ బేగ్, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కార్పొరేటర్లు రామాంజనేయులు, అనిల్‌కుమార్‌రెడ్డి,   పార్టీ నాయకులు నాయకులు నగేష్, నాని, బోయ చంద్రశేఖర్, సుధాకర్‌ రెడ్డి, గంగాధర్, శ్రీరాములు, గోవిందు, నాగార్జున రెడ్డి, పోతులయ్య, ఉష తదితరులు పాల్గొన్నారు.

Back to Top