మనం మన పిల్లలకు అందించే గొప్ప ఆస్తి చదువు మాత్రమే...

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 

అనంతపురం: తల్లిదండ్రులు పిల్లలకు అందించే శాశ్వ‌త ఆస్తి  చదువు మాత్రమే అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి వరుసగా 4వ జగనన్న అమ్మఒడి జిల్లాస్థాయి కార్యక్రమం స్థానిక కె యస్ ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని నమ్మి విద్యకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పేదరికం ఒకటే ప్రామాణికంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 15000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని  విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చి పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  ముఖ్యమంత్రి చేతుల మీదుగా  సుమారు42 ,61 ,9 6 5 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,3 93.94 కోట్లు జమ  చేయడం జరుగుతున్న దన్నారు. ముఖ్యంగా పేదరికంతో ఏ ఒక్క పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న మంచి ఆలోచనతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కోట్లాది రూపాయలు విద్యా రంగానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదని అందువల్ల విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గతం కంటే మిన్నగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకుంటున్నాయన్నారు. అందువల్ల ఇప్పటినుండే పిల్లలందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌతమి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ,జెడ్పీ  చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ,నగర మేయర్ వసీం, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ,రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ హరిత, అహూడ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాసులు ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎమ్ ఎల్ ఉమాదేవి , ఎడిసిసి చైర్మన్ లిఖిత ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ మేడా రామలక్ష్మి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Back to Top