మేనిఫెస్టోకు పవిత్రత ఇచ్చిన వైయస్‌ఆర్‌సీపీ

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

గుంటూరు:  ఎన్నికల మేనిఫెస్టోకు పవిత్రత  ఇచ్చిన పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.  మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మా పార్టీకి అనుహ్యమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎనికల తరువాత టీడీపీ ఉనికి లేకుండా పోతుందని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని తెలిపారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. ఘర్షణ పడతాం, గొడవలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
 

Back to Top