ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ 

 
 ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది 

 పుష్కరాల ప్రమాదానికి కారణమైనవారిలో ఎంతమంది అరెస్ట్‌ చేశారు?

సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం విడ్డూరం 

 వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు 

తాడేపల్లి : ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అయితే.. ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎల్జీపాలిమర్స్‌తో లాలూచీ పడాల్సిన అవసరం​ తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.  ఆ సంస్థతో లాలుచీ పడి సింహాచల ఆలయ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
 
గ్యాస్‌ బాధితులకు కనివినీ రీతిలో సాయం 
గ్యాస్‌ ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంబటి రాంబాబు చెప్పారు. విశాఖ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డ వేగంగా స్పందంచారని, ప్రమాదం జరిగిన రోజే బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు. గ్యాస్‌ బాధితులకు కనివినీ రీతిలో సాయం చేశారన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభిస్తే.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు ఎందుకు రాలేదు
విశాఖలో ఇంత ఘోరం జరిగితే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు పరామర్శించేందుకు రాలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విశాఖకు వచ్చేందుకు చంద్రబాబు కేంద్రం పర్మిషన్‌ ఇచ్చిందో లేదో తెలియదని, ఆ విషయాన్ని చద్రబాబు ఎందుకు బయటపట్టడం లేదని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించే మనసు ఉంటేకారులో కూడా విశాఖకు రావొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేదన్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని చెప్పుకునే చంద్రబాబుకు బాధితులను పరామర్శించేందుకు మనసు రాలేదా అని నిలదీశారు. గోదావరి పుష్కరాల ప్రమాదానికి కారణమైనవారిలో ఎంతమంది అరెస్ట్‌ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గెయిల్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగితే కేవలం రూ.3 లక్షల పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.  సీబీఐని రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితమంతా రాజకీయ కుట్రలేనని అంబటి విమర్శించారు. 

Back to Top