వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు బాబు బయటకు రారా?

హెరిటేజ్‌లో కరోనాను ఆపలేని బాబు..ఏపీకి వచ్చి ఏం చేస్తారు?

హెరిటేజ్‌లో ఏం జరుగుతుందో ఎల్లో మీడియా ఎందుకు చూపడం లేదు

సీఎం వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది

జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉంటే కరోనా ఏం చేయలేదు

దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టే వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి బయటకు రారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కరోనా వైరస్‌ కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నారని, సీఎం వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరిస్తుందని మండిపడ్డారు.  ఈ ఎల్లో మీడియా రాతలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని అంబటి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లోని హెరిటేజ్‌ కంపెనీలో కరోనా సోకితే ఆపలేని చంద్రబాబు..ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఏం చేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసలు హెరిటేజ్‌లో ఏం జరుగుతుందో వాస్తవాలు ప్రజలు చెప్పాలన్నారు. హెరిటేజ్‌లో జరిగేది ఎల్లో మీడియా ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు ఖాళీ సమయంలో ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కరోనా ఎవరికైనా వస్తుందని, వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారన్నారు. సీఎం వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరిస్తుందని ధ్వజమెత్తారు. దేశంలోనే ఏపీలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించలేని స్థితిలో ఎల్లో మీడియా ఉందన్నారు.  లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినిందన్నారు. కరోనా ఉదృతి తగ్గకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవన్నారు.  ఎల్లోమీడియాను ప్రజలు నమ్మొద్దని అంబటి రాంబాబు సూచించారు.

Back to Top