ఆ ఉత్తరం భారతమ్మ రాసింది కాదు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అంబటి రాంబాబు 

 ఎవరో భారతమ్మ పేరుతో కావాలనే ఆ లెటర్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు

అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి సతీమణి భారతమ్మ గారు ఏదో లెటర్ రాశారని, సోషల్ మీడియా- వాట్సాప్ గ్రూపుల లో సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతున్న లెటర్ భారతమ్మ గారు రాసింది కాదు. ఆ ఉత్తరం నకిలీది..." అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. భారతమ్మ గారు ఏ లెటర్ రాయలేదు అని, ఎవరో కావాలని అలాంటి ఉత్తరాలు సర్క్యులేట్ చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని అన్నారు.  భారతమ్మ గారికి అటువంటి లెటర్ రాయాల్సిన అవసరం కూడా లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top