చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ స‌భ్యుల ఆందోళన

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

అమ‌రావ‌తి: స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించాల‌న్న‌దే టీడీపీ స‌భ్యుల ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎనిమిదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ స‌భ్యులు స్పీకర్‌ పోడియం వద్ద  నినాదాలు చేస్తున్నారు. సభా కర్యకలాపాలను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును  ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో రోజూ గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ లక్ష్యం అంటూ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభను సజావుగా సాగనివ్వరని.. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు ఆందోళన చేస్తున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top