మండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికం

బిల్లును సెలెక్ట్‌ కమిటికి పంపడం రూల్స్‌కు విరుద్ధం

అంబటి రాంబాబు

మండలి: సెలెక్ట్‌ కమిటీకి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును శాసన మండలి చైర్మన్‌ పంపడం అప్రజాస్వామికమని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. చైర్మన్‌ను టీడీపీ సభ్యులు డిక్టెట్‌ చేశారు. చైర్మన్‌ను ఒత్తిడి చేయడంతో ఆయన అప్రజాస్వామికంగా  వ్యవహరించారు. రూల్స్‌ ప్రకారం బిల్లును సెలెక్ట్‌ కమిటీకి ఇచ్చే అవకాశం లేదని చైర్మన్‌ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరం. పెద్దల సభ సలహాలు ఇవ్వవచ్చు కానీ..దుర్భుద్దీతో చేసినట్లుగా ఎవరికైనా అర్థం అవుతుంది. బిల్లును ఆలస్యం చేయడం వల్ల ఏమీ కాదని, చైర్మన్‌ చంద్రబాబు ఆదేశాల మేరకు చేస్తున్నారు. 
 

Back to Top