పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు అమ్మ ఒడి

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విద్య ఖరీదైన అంశంగా మారింది

ప్రజలకు మేలు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు

రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడితో లబ్ధి

 

 

అమరావతి: పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విద్యపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  విద్యకు సంబంధించిన అంశంపై సభలో మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏయే రంగాలకు ఖర్చు చేయాలనే అంశంపై ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి కుటుంబానికి సంబంధించి నెలసరి ఆదాయాన్ని వారికి తగ్గట్టుగా అవసరాలకు ఖర్చు చేస్తుంటారు. పేద, ధనిక అందరూ ఇదే ప్రక్రియ పాటిస్తారు. సంపాదించే ప్రతి కుటుంబం వారికి సంబంధించి పిల్లల గురించి ఆలోచన చేస్తాయి. ఉన్నత వర్గాలు పిల్లలకు సంబంధించిన విద్యలో ఉన్నత ప్రమాణాలు కలిగిన స్కూళ్లలో చదివిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబాలు వారి పిల్లలను ఆదాయాన్ని బట్టి స్కూళ్లలో చేర్పిస్తుంటారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య భారంగా మారింది. ఈ రోజు పేద, బడుగు, బలహీన వర్గాలు నెలసరి ఆదాయాన్ని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దలేక పనులకు పంపించే అవకాశాలు చూశాం.

అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెనడి చెప్పిన మాటలను గుర్తు చేశారు. పిల్లల్లో అందరికి సమాన హక్కులు ఉండాలన్నారు. ఇవన్నీ చూసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లలకు సమాన హక్కును కల్పించారు. ఇలాంటి నాయకుడితో కలిసి పని చేయడం, ఈ సభలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో గత ఐదేళ్లలో రాష్ట్రంలో 9 వేల పాఠశాలలను మూసి వేశారు. దేశంలో ఉన్న ఎన్‌రోల్‌మెంట్‌ గమనిస్తే..మనం తక్కువగా ఉన్నాం. చంద్రబాబు నేల విడిచి సాము చేశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వైయస్‌ జగన్‌ గొప్పగా ఆలోచన చేశారు. మహానేత ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో 2016లో 14 ఏళ్లలోపు బాల కార్మికులు 13294 మంది ఉంటే , 2017లో 60 వేల మంది బాల కార్మికులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపేద బిడ్డకు యూనిఫాం, స్కూల్, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పిల్లలను బడికి పంపించిన 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ ముందుకు వచ్చారు. వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని ప్రతి తెలుగువాడు కీర్తిస్తున్నాడు. ఎన్నికల ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ప్రతి పేద తల్లికి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది. బాలికలకు సమాన హక్కులు లేవు. 8వ తరగతి దాటిన తరువాత బాలికల డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. వారికి విద్యనందించాల్సిన అవసరం ఉంది. నిన్న ఇస్త్రో చేపట్టిన చంద్రయాన్‌–2లో ప్రధాన పాత్ర పోషించిన శవన్‌ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వ్యక్తి అని వివరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చారు. సభలో ఉన్న 70 శాతం మంది ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో మన బిడ్డలను పెట్టాలనే తపనతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి పథకానికి అమర్‌నాథ్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు.  

 

Back to Top