13 జిల్లాలకు చంద్రబాబు విలనే

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌
 

అసెంబ్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు 13 జిల్లాలకు విలన్‌గా మిగిలారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రాజకీయం కోసం మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. క్యాపిటల్‌ భూములపై చంద్రబాబు చేస్తున్న ఉద్యమాన్ని ఏమంటారు?. విశాఖ క్యాపిటల్‌కు ఒక్క సెంట్‌ కూడా ప్రైవేట్‌ భూమిని తీసుకోబోనని వైయస్‌ జగన్‌ చెబుతున్నారు. ఏ స్వార్థం లేకుండా వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ,ప్రజలు ఓడించిన వ్యక్తులు, ఆర్థిక నేరస్తులు టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. విశాఖపై టీడీపీ సభ్యులు విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుంటే చాలు మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదు. పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేస్తే టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాబివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. 

Back to Top