సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎమ్మెల్యే ఆర్కే.. వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఆర్కే సీఎం స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఈ మేర‌కు సీఎం జగన్ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ గంజి చిరంజీవి, వేణుగోపాల స్వామిరెడ్డి ఉన్నారు.

Back to Top