ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
 

 అమరావతి: రెండునెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లి, మంగళగిరిలను మోడల్‌ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ.. రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌  తెలిపారన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణంలో ఉన్నారని..ఇక్కడి అభివృద్ధిపై రివ్యూ చేయలేదని ఆర్కే అన్నారు. ఇదే రోడ్లపై చంద్రబాబు తిరిగారని..కానీ పైసా కేటాయించలేదని విమర్శించారు. అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్‌ను ఓడించారని పేర్కొన్నారు. 
 

Back to Top