సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌న‌సారా దీవించాలి

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయ్యేలా ప్ర‌తి ఒక్క‌రూ మ‌న‌సారా దీవించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు విజ్ఞ‌ప్తి చేశారు.   పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, సుభద్ర సచివాలయం బడేవలస గ్రామంలో మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే జోగారావు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఈ మూడున్న‌రేళ్ల‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు.  సంక్షేమ పథకాలు అమలు తీరు తెలుసుకుని, అర్హులు అందరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూడటమే గడప గడపకు మన ప్రభుత్వం ప్రధాన లక్ష్యమ‌ని ఎమ్మెల్యే తెలిపారు.  

 బడేవలస గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో జల జీవన్ మిషన్ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన ఇంటింటి కొళాయి పైప్‌లైన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.   కార్య‌క్ర‌మంలో గ్రామ సర్పంచ్ గంట సింహాచలమ్మ‌, వైస్ సర్పంచ్ గొంగాడ రామలక్ష్మి, కృష్ణ దంపతులు, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top