సీఎంకు మంచి పేరు వస్తుందని బాబుకు భయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, శ్రీనివాసులు
 

తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరొస్తుందనే భయంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే ఆందోళనలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి వికేంద్రకరణ నిర్ణయాన్ని ప్రజలంతా సమర్థిస్తుంటే.. చంద్రబాబు అండ్‌ కో మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని, మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top