మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఎంపీ మిథున్‌రెడ్డి
04 Jul 2019 4:37 PM
న్యూఢిల్లీ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన.. గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులైన విషయం విదితమే. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించిన ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.