విదేశాంగ మంత్రిని కలిసిన  మిథున్‌రెడ్డి

ఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి మంగళవారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ను కలిశారు. కువైట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాసులు అరెస్టు అయ్యారని, వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జైశంకర్‌ను అభ్యర్థించారు. తెలంగాణలోని వరంగల్‌లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆంధ్రవాసులు కువైట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారని, దీంతో వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని మిథున్‌రెడ్డి విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top