గతంలో ఎన్నికల కోసమే పథకాలు అమలు చేశారు 

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కోసమే ప్రభుత్వ పథకాలను అమలు చేశారని మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. విద్యశాఖ, నాడు–నేడు పసులపై టీడీపీ నేతల ఆరోపణలను మంత్రి బుగ్గన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అని అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు పింఛన్లు పెంచింది. పసుపు–కుంకుమ కార్యక్రమం ఎన్నికలకు 15 రోజుల ముందు అమలు చేసింది. బిల్లులు రూ.45 వేల కోట్లు ఇచ్చారు. ఏదైనా కూడా బ్రాడ్‌గా చూడాలి. అమ్మ ఒడి కార్యక్రమం దేశవ్యాప్తంగా అభినందించిన కార్యక్రమం. పిల్లలను బడికి పంపించే తల్లులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పరిసరాలను శుభ్రం చేసేందుకు అందులో కొంత మాత్రమే విరాళంగా ఇవ్వాలని చెబితే దాన్ని ప్రతిపక్షం భూతద్దంలో చూస్తోంది. నాడు–నేడు అనే కార్యక్రమంలో అన్ని రకాలుగా పనులు చేపతున్నాం. కొన్ని భవనాలను చిన్న చిన్న మరమ్మతులు చేపడుతున్నాం. కొన్ని చోట్ల రూప్‌ తీసేయాల్సి వస్తుంది. మరికొన్ని చోట్ల రంగులు వేస్తున్నామని మంత్రి బుగ్గన వివరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top