నేర‌డి బ్యారేజ్ నిర్మాణ స్థ‌లం ప‌రిశీల‌న 

 శ్రీకాకుళం : వంశధార ప్రాజెక్ట్ ఆయువు పట్టైన ప్రతిపాదిత నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని కాట్రగడ వద్ద పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ త‌దిత‌రులు శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఒడిస్సా తో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణానికి సవివర నివేదిక (డి పి ఆర్) తయారు చేయాలని  మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారుల‌ను ఆదేశించారు.  ఒడిశాలో ముంపునకు గురవుతున్న నూట ఎకరాల భూమిని సేకరించడానికి, లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ‌దాస్ అదేశాలు జారీ చేశారు.

మంత్రుల పర్యటనలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వంశధార ఎస్.ఇ డొల తిరుమల రావు, కలెక్టర్ శ్రీ కేష్ లాటకర్, ఆర్దేవో కుమార్, డిసిసిబి మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగు, ఇతర నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top