కేజీహెచ్‌ తనిఖీ చేసిన మంత్రులు

విశాఖ: విశాఖపట్నం నగరంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్‌) ఆసుపత్రిని మంత్రులు ఆళ్లనాని, పుష్పాశ్రీవాణి, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్‌, కలెక్టర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్ష నిర్వహించారు.  ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రులు పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో విశాఖపట్నం జిల్లా ఎంపీ  ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, అరకు ఎంపీ మాధవి,  విశాఖ ఎమ్మెల్యేలు , నగర అధ్యక్షులు వంశీ, వైయస్‌ఆర్‌సీపీ సమన్వయ కర్తలు, ఉన్నారు.
 

Back to Top