ప్రభుత్వంపై రాజకీయ కుట్ర జరుగుతోంది

ఆలయాలపై జరుగుతున్న దాడులను సీరియస్‌గా తీసుకున్నాం

చంద్రబాబు కూల్చేసిన దేవాలయాలను పునర్‌నిర్మిస్తాం

బూట్లు వేసుకొని పూజలు చేసే వ్యక్తి చంద్రబాబు 

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజం

విశాఖపట్నం: ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రభుత్వంపై కొందరు బురదజల్లుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. వివిశాఖ శార‌దాపీఠాన్ని మంత్రులు వెల్లంపల్లి, శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిశారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. 

అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఆలయాలపై దాడులు చేసేవారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు లాంటి వ్యక్తులు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 40 దేవాలయాలను కూల్చేసిన వ్యక్తి.. ఈ రోజున నీతులు మాట్లాడడం హేయమన్నారు. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం వైయస్‌ జగన్‌ కమిటీ వేశారని గుర్తుచేశారు.

చంద్రబాబు హయాంలో కూల్చేసిన 40 ఆలయాలను పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుందన్నారు. వాటిని ఎలాగైనా నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని, దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభించిన వెంటనే కొన్ని ఆలయాలను యథాస్థానంలో నిర్మిస్తామన్నారు. మిగిలినవి ఫ్లైఓవర్‌  సమీపంలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతమైన ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై విచారణ జరుగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, తప్పుచేసిన వారికి కఠిన శిక్ష తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top